'లీడర్' రాణాతో రామ్ గోపాల్ వర్మ సినిమా?
'లీడర్' చిత్రంతో తెరంగ్రేటం చేసిన రామానాయుడు మనవడు రాణాపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కన్ను పడింది. లేటెస్ట్ గా ఆయన రాణాకి ట్విట్టర్ లో లీడర్ సినిమా డివిడి పంపమని, దాని కోసం డెస్పరేట్ గా ఎదురుచూస్తున్నట్లు ట్వీట్ చేసారు. దానికి రాణా తానే స్వయంగా డీవిడి పట్టుకుని వచ్చి కలుస్తానని సమాధానమిచ్చాడు. మరి రామ్ గోపాల్ వర్మ మనస్సులో రాణా తో ఏదన్నా ప్రాజెక్టు చేద్దామని ఆలోచన వచ్చిందేమో..అందుకే ఈ ప్రయత్నమేమో అంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం హిందీలోనూ రాణా..దమ్ మారో దమ్ అనే చిత్రం చేస్తున్నారు. రాణాతో చిత్రం చేస్తే అటు హిందీకి, ఇటు తెలుగుకీ వర్కువుట్ చేయ్యచ్చనే ఆలోచనలోనే రాణాని కాంట్రాక్ట్ చేసి ఉండవచ్చునని అంటున్నారు. అందులోనూ రాణా...ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తనయుడు కావటం కూడా ఆర్ధికంగా సినిమాకి పనికొచ్చే అంశం అంటున్నారు. మరో ప్రక్క రాణా కూడా రామ్ గోపాల్ వర్మ సినిమాలంటే బాగా ఇష్టం అని తెలస్తోంది. అంటే అన్నీ అనుకూలిస్తే రాణా, రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ లో సినిమా వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.


Click it and Unblock the Notifications











