వారంతా దానం చేసేందుకు సినిమాలు తీస్తున్నారా?.. ఆ కామెంట్లపై ఆర్జీవీ ఫైర్

రామ్ గోపాల్ వర్మతో పెట్టుకుంటే అంతే మరి. వర్మ అలా వదిలేస్తేనే అందరికీ మంచిది. వేడిలో ఉన్నప్పుడు ఓ నాలుగు మాటలు వదిలేసి ఊరుకుంటాడు. వర్మ అన్నాడని ఎదుటి వారు రెచ్చిపోతే.. అతను ఇంకా రెచ్చిపోతాడు. అందుకే పవర్ స్టార్ సినిమాతో పోయేదాన్ని ఇప్పుడు 'అల్లు'వరకు వచ్చింది. తాజాగా అల్లు పేరుతో ఓ సినిమా తీయబోతోన్నట్టు, కథా సారాంశం, అందలోని నటీనటులు, క్యారెక్టర్ల పేర్లను ప్రకటించాడు.

అల్లు అంటూ అల్లు అరవింద్, మెగా ఫ్యామిలీని టార్గెట్ చేయబోతోన్నాడని అందరికీ అర్థమవుతూనే ఉంది. ఓ పెద్ద స్టార్ జన రాజ్యం అనే పార్టీ పెట్టిన తరువాత, అతని బావమరిది ఎంట్రీ ఆపై జరిగిన కథే అల్లు సినిమా అని ప్రకటించాడు. ఇందులో థియేటర్లు మాఫియా, పార్టీ టిక్కెట్లు అమ్ముకోవడం, అన్నదమ్ముల మధ్య దూరం పెంచడం వంటివి కూడా ఉంటాయని పరోక్షంగా చెప్పాడు.

RGV Fires On Who Trolls On Him About Allu Movie

ఆర్జీవీ అల్లు చిత్రాన్ని ప్రకటించడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో కొందరు ఆర్జీవీ తిట్టిపోస్తున్నారు. కేవలం డబ్బులు సంపాదించుకోవడానికి ఇలాంటి సినిమాలను తీస్తున్నాడని విమర్శిస్తున్నారు. ఇలాంటి కామెంట్లపై వర్మ తాజాగా స్పందించాడు. 'నేను డబ్బుల కోసమే ఇలాంటి సినిమాలను తీస్తున్నానని ఎవరైతే అంటున్నారో.. వారిని ఒకటి అడగదలుచుకున్నాను. మిగతా ఫిల్మ్ మేకర్స్ డబ్బుల కోసం సినిమాలు చేయడం లేదా? మానవత్వం, ప్రేమ కోసం సినిమాలు తీస్తున్నారా? లేదా ఛారిటీ లేదా పేద ప్రజలకు దానం చేయడానికి తీస్తున్నారా?' అంటూ ఫైర్ అయ్యాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X