నిరాహార దీక్షలపై రామ్ గోపాల్ వర్మ వెటకారం
రామ్ గోపాల్ వర్మ తాజాగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ట్విట్టర్ లో ఫన్నీ కామెంట్స్ చేసారు. ఆయన ఏమి ట్వీట్ చేసారంటే...రాజకీయనాయకులను ఉదాహరణగా తీసుకుని నిర్మాతలు, దర్శకులు నిరాహార దీక్షలు చేయాలి. తన సినిమాలు ప్రేక్షకులు తప్పనిసరిగా చూడాలంటూ డిమాండ్ చేయాలి అన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నిరాహార దీక్ష కొనసాగిస్తూంటే...జగన్ ఇప్పటికే దాన్ని పూర్తి చేసారు. కేసీఆర్ త్వరలో చేస్తానని ప్రకటించారు. ఇంతకీ ఈ కామెంట్స్ వీరిలో ఎవరిని ఉద్దేశించి అన్నారనేది చర్చగా మారింది.


Click it and Unblock the Notifications











