గొలుసులతో కట్టేయకపోతే కరుస్తాడేమో?: ఆర్జీవీ సంచలన ట్వీట్

టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తన మనసులో ఎమనిపిస్తే ఆ విషయాన్ని ట్విట్టర్లో నిర్మొహమాటంగా చెప్పేస్తారు. తాజాగా ఆయన ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కెఏ పాల్ గురించి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కెఏపాల్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఆయన వింత ప్రవర్తనకు సంబంధించి పలు వీడియోలు ప్రజలను ఆశ్చర్య పరిచాయి. అలాంటి వీడియో ఒకటి ట్విట్టర్లో పోస్ట్ చేశారు ఆర్జీవీ.

గొలుసేసి కట్టేయకపోతే కరుస్తాడేమో?

కేఏ పాల్ పోలింగ్ బూత్ నుంచి పరుగెత్తుకుంటూ వస్తున్న వీడియోను రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. ఈ వీడియో గురించి వర్మ ప్రస్తావిస్తూ.. ‘గొలుసేసి కట్టేయకపోతే కరుస్తాడేమో?' అని వ్యాఖ్యానించారు.

గతంలో ఆర్జీవీ వర్సెస్ కేఏ పాల్

గతంలో ఆర్జీవీ వర్సెస్ కేఏ పాల్

గతంలోనూ రామ్ గోపాల్ వర్మ, కెఏ పాల్ మధ్య వివాదం చోటు చేసుకుంది. వర్మ నా కొళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నాడని కేఏ పాల్ చెప్పగా... తాను అలా ఎప్పుడూ చేయను, అతడి కాళ్లు గట్టిగా పట్టుకొని వెనక్కి లాగుదామని మాత్రమే ప్రయత్నించాను, అతడి తల నేలకేసి కొట్టుకొంటే అప్పుడైనా బుర్ర సెట్ అవుతుందని భావించాను అంటూ ఆర్జీవీ సెటైర్ వేసిన సంగతి తెలిసిందే.

బయోపిక్ తీయడానికే పిలిపించాడట

బయోపిక్ తీయడానికే పిలిపించాడట

తన బయోపిక్ తీయాలని కోరడానికే.... రామ్ గోపాల్ వర్మను ఆ మధ్య కెఏ పాల్ పిలింపించినట్లు వార్తలు వచ్చాయి. అయితే వర్మ నిర్మొహమాటంగా మీ బయోపిక్ తీయను అని తేల్చి చెప్పారట. ఆ తర్వాత కెఏ పాల్ కాళ్లు పట్టుకున్న వర్మ అంటూ న్యూస్ స్ప్రెడ్ అయింది.

బాబు, జగన్ మీద మరో ట్వీట్

చంద్రబాబు నాయుడు... జగన్ సమక్షంలో వైసీపీలో చేరాడు అంటూ... సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ మార్ఫింగ్ ఫోటోను ఆర్జీవీ తన ట్విట్టర్లో షేర్ చేయడం గమనార్హం. వర్మ చేసిన ఈ ట్వీట్ మీద టీడీపీ, వైసీసీ వర్గాలు కామెంట్లతో విరుచుకుపడ్డారు.

లక్ష్మీస్ ఎన్టీఆర్

లక్ష్మీస్ ఎన్టీఆర్

కాగా.... రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' మూవీ చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ఉందనే ఆరోపణలో ఆ చిత్రాన్ని ఎన్నికల ముందు ఏపీలో రిలీజ్ కాకుండా చేయడంలో సక్సెస్ అయ్యారు. ఎలాగైనా ఎన్నికల ముందు సినిమాను రిలీజ్ చేద్దామని చాలా ట్రైచేసిన వర్మ అండ్ టీం ప్రయత్నాలు ఫలించలేదు. ఎన్నికలు ముగియడంతో వర్మ కూడా ఈ మూవీ రిలీజ్ విషయాన్ని లైట్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X