మియా, చార్మీ ఎవరు ఇస్మార్టో.. నీ పడకగదికే తెలుసు.. ఆర్జీవికి షాకిచ్చిన విజయ్ దేవర ఫ్యాన్స్
ప్రముఖ దర్శకుడు రాం గోపాల్ వర్మ నోటి దురుసుపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ సినిమా కలెక్షన్లపై చేసిన ట్వీట్‌పై నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. జూలై 19వ తేదీన విడుదలైన సినిమా కలెక్షన్లు రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్ కంటే తక్కువగా ఉన్నాయంటూ చేసిన ట్వీట్‌పై కొందరు విరుచుకుపడ్డారు. ఇంతకు ఆర్జీవి ఏమన్నారంటే..

డియర్ కామ్రేడ్ కలెక్షన్లపై వర్మ
ఇస్మార్ట్ శంకర్, డియర్ కామ్రేడ్ కలెక్షన్లపై ట్వీట్ చేస్తూ ఇస్మార్ట్‌గా లేని కామ్రేడ్ కంటే ఇస్మార్ట్ శంకర్ చాలా ఇస్మార్ట్‌గా ఉన్నాడు. నాన్ ఇస్మార్ట్ కామ్రేడ్ శంకర్ కంటే ఇస్మార్ట్‌గా లేడు అంటూ వర్మ తనదైన శైలిలో ట్వీట్ చేశాడు. వాస్తవమేంటే రామ్ విజయానికి తెలుసు అని ట్విస్ట్ ఇచ్చాడు.

నీలాంటి వ్యక్తి పోల్చడం సిగ్గుచేటు
కమర్షియల్ ఎంటర్‌టైనర్‌తో క్వాలిటీ ఉన్న డియర్ కామ్రేడ్‌తో నీలాంటి వ్యక్తి పోల్చడం సిగ్గు చేటు. కంటెంట్ లేని సినిమాలు తీసే వ్యక్తిగా నీవు ఇలాంటి పోలీకలు చేస్తావని ఊహించలేదు. విషయం లేకుండా వ్యాఖ్యలు చేయడం మరీ విడ్డూరం. నీలాంటి వ్యక్తికి కంటెంట్ గురించి ఏం తెలుసు అని ఓ నెటిజన్ భగ్గుమన్నాడు.

విజయ్ ఫాలోవర్‌గా ఆర్జీవికి
సెన్స్‌లెస్ శంకర్ కంటే డియర్ కామ్రేడ్ చాలా సెన్సిబుల్ లేదా సెన్స్‌లెస్ శంకర్ సెన్సిబుల్ ఉన్న డియర్ కామ్రేడ్‌కు సరితూగడు. వాస్తవమేమిటో విజయ్ ఫాలోవర్ రామ్ అలియాస్ ఆర్జీవికి బాగా తెలుసు అంటూ మరో నెటిజన్ షాకిచ్చాడు. మీరు పక్షపాతంతో వ్యవహరించకూడదు. ముందు డియర్ కామ్రేడ్ చూడు. ఆ తర్వాత కలెక్షన్ల గురించి మాట్లాడు అని మరో నెటిజన్ అన్నాడు.

మియా, చార్మీలను లాగడంతో
నాన్ఇస్మార్ట్ చార్మీ కంటే మియా మాల్కోవా ఎక్కువ స్మార్ట్ లేదా నాన్ ఇస్మార్ట్ చార్మీ.. ఇస్మార్ట్ మియా కంటే ఎక్కువ కాదు. ఈ వాస్తవం ఆర్జీవికి బాగా తెలుసు. అంతేకంటే ఆయన పడకగదికి ఇంకా బాగా తెలుసు అంటూ నెటిజన్లు కామెంట్ చేశారు. ఇలా రకరకాల కామెంట్లతో ఆర్జీవిని రఫ్ ఆడేస్తున్నారు.


Click it and Unblock the Notifications











