ఈ సారి ఆ హీరోతో 'రంగీళా' తీయనున్న రామ్ గోపాల్ వర్మ
రామ్ గోపాల్ వర్మ 1995 లో ఊర్మిళ, అమీర్ ఖాన్,జాకీ షరాఫ్ లతో రంగీళా చిత్రాన్ని తీసి సూపర్ హిట్ ఇచ్చారు. అయితే ఇన్నాళ్ళకు మళ్ళీ అదే కాన్సెప్టు తరహా చిత్రాన్ని రూపొందించాలనే కోరిక ఆయనలో బయిలుదేరింది. అయితే హీరోగా ఈ సారి రణబీర్ కపూర్ ని ఎన్నుకున్నారు. ప్రస్తుతం రణబీర్..బాలీవుడ్ కి కలల రాకుమారుడు. దాంతో అతని క్రేజ్, తన మేకింగ్ తో ఓ కొత్త సంచలనానికి తెరతీయవచ్చునని ఆశిస్తున్నట్లు సమాచారం. అయితే వర్మ మీడియాతో ఈ విషయాలను చర్చించలేదు. నేను, రణబీర్ ఏ ప్రాజెక్టులు చేయగలమో అన్న విషయాలపై చర్చించాం అంతే అని తప్పుకున్నారు. ఇక వర్మ ప్రస్తుతం పరిటాల రవి జీవిత చరిత్రగా చెపుతూ రక్త చరిత్ర అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అలాగే మీడియాపై తీసిన రణ్ చిత్రం సైతం రిలీజ్ కు రెడీగా ఉంది. వీటితో పాటు తన శిష్యుడు మిలింగ్ గడసాక్కర్ దర్శకత్వంలో ఫూంక్ చిత్రం సీక్వెల్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











