రామ్ గోపాల్ వర్మ...కొత్త సినిమాల టైటిల్స్ ఇవే..

ఇక రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'సత్య' చిత్రం మంచి విజయం సాధించిన నేపథ్యంలో.......ఇప్పటి పరిస్థితుల ఆధారంగా 'సత్య 2' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. శర్వానంద్, అనైక జంటగా ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. అయితే బిజినెస్ అనుకున్న రేంజిలో కావటం లేదని ట్రేడ్ వర్గాల సమాచారం. రామ్ గోపాల్ వర్మ సినిమాలు వరసగా భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ కావటంతో ఈ చిత్రం బిజినెస్ పై ఆ ఇంపాక్ట్ పడిందని సమాచారం.
దాంతో వర్మ ఎలాగైనా ఈ సినిమాని ఒడ్డున పడేయాలని సతమతమవుతున్నట్లు ముంబై వర్గాల సమాచారం. మరో ప్రక్క శర్వానంద్ కూడా క్లాస్ హీరో కావటంతో బిజినెస్ పరంగా పెద్ద హెల్ప్ కావటంలేదు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ అందరికీ బిజినెస్ మ్యాన్ చిత్రం గుర్తుకు తేవటం కూడా మైనస్ గా మారింది. అయితే చిత్రం పై వర్మ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
వర్మ మాట్లాడుతూ...1998లో వచ్చిన 'సత్య' అప్పటి పరిస్థితుల ఆధారంగా రూపొందించాం. అప్పటికి ఇప్పటికీ సమాజంలో చాలా మార్పు వచ్చింది. ఇప్పటి పరిస్థితుల ఆధారంగా ఈచిత్రం తెరకెక్కించాం. క్రైమ్ చేసే వ్యక్తి సైకాలజీ స్టడీ చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ధీరూబాయ్ అంబానీ లాంటి వ్యక్తి కార్పొరేట్ సంస్థల వైపు కాకుండా, అండర్ వరల్డ్ వైపు వెళ్లి ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందనేది ఈ సినిమాలో చూపిస్తున్నాం' అన్నారు.


Click it and Unblock the Notifications











