twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వెన్నుపోటు నేత మీదే కేసీఆర్ వార్.. టైగర్ కేసీఆర్‌లో బాబే టార్గెట్.. ట్విట్టర్‌లో ఆర్జీవీ క్లారిటీ!

    |

    సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ మరో వివాదానికి తెర తీసే ప్రయత్నం చేస్తున్నారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ తర్వాత కేసీఆర్ టైగర్ అనే సినిమాను రూపొందించబోతున్నట్టు ఆయన వెల్లడించడం సెన్సేషన్‌ను క్రియేట్ చేసింది. అంతటితో ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా ఓ వీడియోను విడుదల చేయడం సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దాంతో ఆ వీడియోపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతుండటంతో దానిపై వర్మ వివరణ ఇచ్చారు. ఇంతకు వీడియోలో ఏమన్నందంటే..

     వీడియోలో తాటతీయడానికి వస్తున్నా

    వీడియోలో తాటతీయడానికి వస్తున్నా

    మా భాష మీద నవ్వినవ్.. మా ముఖాల మీద ఊసినవ్.. మా బాడీల మీద నడిసిన్ ఓ ఆంధ్రోడా.. వస్తున్నా.. తాటతీయనికీ వస్తున్నా.. టైగర్ కేసీఆర్ కమింగ్ సూన్ అంటూ ఓ వీడియోను విడుదల చేశాడు. దాంతో ఆంధ్రా ప్రాంతం వారు వర్మపై భగ్గుమన్నారు. తనపై పెరుగుతున్న వ్యతిరేకతను గ్రహించిన ఆర్జీవీ తాజాగా ఓ ట్వీట్ చేశారు.

    వెన్నుపోటుపైనే టైగర్ కేసీఆర్ వార్

    వెన్నుపోటుపైనే టైగర్ కేసీఆర్ వార్

    టైగర్ కేసీఆర్ చిత్రం ఆంధ్రా ప్రజలకు వ్యతిరేకంగా కాదు. తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరిచిన, మోసం చేసిన ఆంధ్రా నాయకులపై ఆ చిత్రం ఉంటుంది. తెలుగు ప్రజలంటే కేసీఆర్‌కు ప్రేమ ఉంది. ఆయన పోరాటమంతా తెలంగాణ ప్రజలను వెన్నుపోటు పొడిచిన ఆంధ్రా నేతల మీదే జరిగింది అని వర్మ క్లారిటీ ఇచ్చారు.

    కథలో విలన్ ఎవరంటే

    కథలో విలన్ ఎవరంటే

    ఇప్పటికే లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ద్వారా ఆంధ్రాలోని ఓ రాజకీయ వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఆంధ్రా ప్రజలను ఉద్దేశించి చేసిన కామెంట్లు వివాదాస్పదమయ్యాయి. ఇక ఈ సినిమాలో ఏ ఆంధ్రా నేతలను విలన్లుగా లేదా విలన్‌గా చిత్రీకరించనున్నారనే విషయంపై రకరకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

    మరోసారి చంద్రబాబే టార్గెట్

    మరోసారి చంద్రబాబే టార్గెట్

    ఇక లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో ఏపీ సీఎం చంద్రబాబును దారుణమైన వెన్నుపోటు దారుడిగా విలన్‌గా చూపించిన సంగతి తెలిసింది. టైగర్ కేసీఆర్ చిత్రంలో కూడా చంద్రబాబునే టార్గెట్ చేయబోతున్నారనేది తాజా సమాచారం. చంద్రబాబును విలన్ చేసి కథ నడిపించే ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది. ఎన్నికల నేపథ్యంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల కాకుండా టీడీపీ వర్గం సఫలమైన సంగతి తెలిసిందే.

    English summary
    RGV given clarity on Tiger KCR Movie. The film #TIGERKCR is not going to be against Andhra People .It will be against only a few Andhra leaders who created humiliating situations for Telangana people KCR loved all telugu people and his war was only with those Andhra Leaders who were back stabbing Telangana people
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X