twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మొన్న మేల్ డైరెక్టర్ తో లిప్ లాక్, ఇప్పుడేమో ఇంకో మగాడికి ఐలవ్యూ: వర్మ కి ఏమయ్యిందీ?

    |

    మొన్నటికి మొన్న ఉడ్తా పంజాబ్ సెన్సార్ గొడవకి స్పందిస్తూ... అనురాగ్ కశ్యప్ ని ఉద్దేశించి "మనిద్దరం "గే"లు కాకపోయినప్పటికీ సెన్సార్ బోర్డు మీద మీరు చేసిన పోరాటానికి.. మీ నోట్లో నోరు పెట్టి ముద్దాడాలని ఉంది" అని ట్వీట్ చేసిన రాం గోపాల్ వర్మ ఈ ర్సారి డొనాల్డ్ ట్రంప్ కి "ఐ లవ్ యూ" చెప్పాడు.

    డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అంటే అభిమానం అని వేరే చెప్పక్కర్లేదు. సందర్భం వచ్చిన ప్రతీసారీ ట్రంప్ పై ఉన్న అభిమానాన్ని వర్మ ప్రదర్శిస్తూనే ఉన్నారు. తాజాగా ఓర్లాండో లోని గే నైట్ క్లబ్ లో.. ఇస్లామిక్ ఉగ్రవాదిగా భావిస్తున్న ఒమర్ మతీన్ కాల్పులు జరిపి 50 మందిని హతమార్చిన నేపథ్యంలో రాము చూపు మరోసారి ట్రంప్ పై పడింది.

    RGV has resorted to politicising it by saying that only US Presidential candidate Donald J Trump can save the nation from terrorism

    అమెరికన్లకు రెండే అవకాశాలున్నాయన్న వర్మ.. ఒకటి వారిని డొనాల్డ్ ట్రంప్ ఆశీర్వదించాలి, లేదా 'అల్లా' ఆశీర్వాదించాలన్నారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి డొనాల్డ్ ట్రంప్ బెటర్ ఆప్షన్ అని రాము చెప్పకనే చెప్పారు.

    'టెర్రరిస్టుల అతిపెద్ద ఆయుధం సర్ ప్రైజ్, ఈ విషయం ఓర్లాండో దాడితో మరోసారి నిరూపితమైంది. సర్ ప్రైజ్ ను ఎవరూ ముందుగా ఊహించలేరు. ముందుగా ఊహిస్తే అది సర్ ప్రైజ్ కాదు' అంటూ రాము తనదైన శైలిలో ట్వీట్ చేశారు. క్లబ్ లో మనుషులను వరుసగా కూర్చున్న బాతులను కాల్చినట్లు కాల్చడం చూస్తుంటే..

    బాధితుల చేతిలో కూడా ఆయుధాలుంటే ఈ ఘటన జరిగేది కాదన్న డొనాల్డ్ ట్రంప్ మాటలు నిజమే అనిపిస్తుందట వర్మకి. "ఒకవేళ మంచి వారికి చెడు జరిగినట్లైతే.. నువ్వు చెడ్డవారికి చెడు చేయాల్సిందే" అంతూ వ్యాఖ్యలు చేసిన ట్రంప్ కి "హే...! ట్రంప్ ఐ లవ్ యూ ఫర్ దిస్ కోట్" అంటూ ట్వీట్ చేసి మరో సారి తాను ట్రంప్ కి మద్దతు ఇస్తున్నానన్న విశయాన్ని స్పష్టం చేసాడు రామ్ గోపాల్ వర్మ.

    English summary
    Instead of sympathising with the victims, RGV has resorted to politicising it by saying that only US Presidential candidate Donald J Trump can save the nation from terrorism. Here’s what he said in a number of posts on Twitter.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X