»   » తల్లి మీద ఒట్టేసి.. మారని వర్మ.. పవన్, రవితేజపై షాకింగ్ కామెంట్స్!

తల్లి మీద ఒట్టేసి.. మారని వర్మ.. పవన్, రవితేజపై షాకింగ్ కామెంట్స్!

Subscribe to Filmibeat Telugu

పవన్ కళ్యాణ్ తల్లిని దూషించమని తానే చెప్పానని నిస్సిగ్గుగా చెప్పుకున్న వర్మ తీవ్ర విమర్శల పాలయ్యాడు. పవన్ కళ్యాణ్ వెనుక జరుగుతున్న కుట్రని, వర్మ ఆంతర్యాన్ని పసిగట్టిన అల్లు అరవింద్ మీడియా సమావేశంలో అతడిని కడిగిపారేసిన సంగతి తెలిసిందే. ప్లాన్ బెడిసి కొట్టటడం పరిస్థితులు తారుమారు అవుతుండడంతో వర్మ వెంటనే స్పందిన క్షమాపణలు చెబుతూ ఓ వీడియో విడుదల చేసాడు. అల్లు అరవింద్ వర్మ తీరుని తీవ్రంగా తప్పుబట్టి, తల్లిలాంటి ఇండస్ట్రీ రొమ్మునే గుద్దాలని చూసిన వ్యక్తి వర్మ అంటూ దుయ్యబట్టిన సంగతి తెలిసిందే. దీనికి సమాధానం ఇస్తూ.. పవన్ కళ్యాణ్ ని తిట్టమని చెప్పి తన రొమ్ము తానే గుద్దుకున్నానని వర్మ సమాధానం ఇచ్చిన సంగతి తెలిసిందే. తాను ఎప్పుడూ తల్లిపై ఒట్టు వేయలేదని.. ఇక పవన్ కళ్యాణ్ గురించి కానీ, మెగా ఫ్యామిలీ గురించి కానీ నెగిటివ్ గా మాట్లాడనని వర్మ తన తల్లిపై ఒట్టు వేసిన సంగతి తెలిసిందే. అయినా వర్మ మారినట్లు కనిపించడంలేదు. తాజగా పవన్ కళ్యాణ్, రవితేజని ఉద్దేశించి వర్మ చేసిన ట్వీట్స్ సంచలనంగా మారాయి.

ఆడియో వేడుకలో పవన్

ఆడియో వేడుకలో పవన్

మాస్ మహా రాజా రవితేజ నటించిన నేల టిక్కెట్టు ఆడియో వేడుక ఇటీవల హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. పవన్ కళ్యాణ్, రవితేజ కలసి ఆడియో వేడుకలో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న వీరిద్దరూ ఒకే వేదికపై కనిపించడంతో అభిమానులకు కన్నుల పండుగగా మారింది.

సరదాగా

సరదాగా

ఆడియో వేడుక మొత్తం పవన్ కళ్యాణ్ చాలా సరదాగా కనిపించారు. రవితేజతో తనకు ఉన్న చనువు బయట పెట్టారు. వేడుక ఆధ్యంతం వీరిద్దరూ నవ్వుతూ కనిపించడం విశేషం.

మారని వర్మ

మారని వర్మ

అనవసరమైన విషయాలని కెలికి మరి వివాదం కొని తెచ్చుకోవడం వర్మకు వెన్నతో పట్టిన విద్య. నేల టిక్కెట్టు ఆడియో వేడుకలో పవన్, రవితేజ పక్క పక్కెనే కూర్చున్నారు. రవితేజ ధరించిన రగ్గుడ్ జీన్స్ ప్యాంటు ఆసక్తికరంగా కనిపించడంతో పవన్ కళ్యాణ్ రవితేజ ప్యాంటు లోని చిరుగుళ్లను పరిశీలించారు. ఈ విషయం అభిమానులకు కూడా ఆసక్తిగా కనిపించింది.

ఈ యాంగిల్ కూడా

ఈ విషయాన్ని కూడా వర్మ వివాదం చేసే ప్రయత్నం చేసాడు. అజ్ఞాతవాసి పవన్ కళ్యాణ్ లో ఈ యాంగిల్ కూడా ఉందని రవితేజ ముఖంలో టచ్ చేసు చూడు టైపు లో క్లియర్ గా తెలుస్తోంది అంటూ ట్వీట్ చేసాడు.

రెండు రాష్ట్రాల మీద పెడితే

రవితేజ జీన్స్ తొడలపై పవన్ కళ్యాణ్ కనబరిచిన ఆసక్తి రెండు రాష్ట్రాపై పెడితే సస్యశ్యామలమవుతాయని వర్మ సెటైర్ వేయడం సంచలనంగా మారింది.

పట్టించుకోని పవన్ ఫాన్స్

పట్టించుకోని పవన్ ఫాన్స్

నేల టిక్కెట్టు ఆడియో వేడుకలో జరిగిన సరదా సన్నివేశాన్ని కూడా వర్మ ఇలా తన వ్యాఖ్యలతో పవన్ అభిమానులని రెచ్చగొట్టే ప్రయత్నం చేసాడు. కాని గతంలోలా పవన్ కళ్యాణ్ అభిమానులు వర్మ ట్వీట్స్ కి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. పవన్ కళ్యాణ్ త్వరలో ఏపీలో పర్యటిస్తున్న నేపథ్యంలో వర్మని పట్టించుకునే మూడ్ లో పవన్ కళ్యాణ్ ఫాన్స్ లేరని చెప్పొచ్చు.

English summary
RGV insulting tweets on Pawan Kalyan and RaviTeja. RGV comments on Nela Ticket audio launch incident
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X