వర్మ ద్వారా మధుశాలిని బాలీవుడ్ ఎంట్రీ
తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఎందరో టాలెంట్ ఉన్న నటీనటులను హిందీ చిత్ర సీమకు పరిచచం చేసిన రాంగోపాల్ వర్మ...తాజాగా మరో తారను బాలీవుడ్ కు పరిచయం చేస్తున్నాడు. అడపా దడపా చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూ నెట్టుకొస్తున్న నటి మధుశాలినిని, తన హిందీ మూవీ డిపార్ట్ మెంట్ ద్వారా బాలీవుడ్ కు పరిచయం చేస్తున్నారు.
అండర్ వరల్డ్-పోలిస్ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాలో...అమితాబ్, సంజయ్ దత్, రాణా దగ్గుబాటిల తో పాటు ఉండే గ్యాంగ్ స్టర్ గా మధుశాలిని నటించబోతోంది. ఈ పాత్ర కోసం ఆడిషన్ నిర్వహిస్తుండగా అనుకోకుండా వర్మ దృష్టి మధుశాలినిపై మళ్లిందట. ఆమె ఆ పాత్రకు సరిగ్గా సరిపోతుందని డిసైడయ్యాడట. బాలీవుడ్ అవకాశం కావడంతో మధు శాలిని కూడా మారు మాట్లాడకుండా ఓకే చెప్పింది. సెప్టెంబర్ లో డిపార్ట్ మెంట్ షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.
ram gopal varma department amitabh bachchan sanjay dutt rana daggubati రాంగోపాల్ వర్మ డిపార్టు మెంటు అమితాబ్ బచ్చన్ సంజయ్ దత్ రాణా దగ్గుబాటి మధుశాలిని


Click it and Unblock the Notifications