అక్కినేని ‘మనం’పై వర్మ కామెంట్
హైదరాబాద్: అక్కినేని మూడు తరాల హీరోలు అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జు, నాగచైతన్య కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ 'మనం'. ఈ చిత్రం గురించి ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా ఓ కామెంట్ ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. ఆ ట్వీట్ లో ఆయన చిత్రాన్ని బాగా మెచ్చుకున్నారు. అలాగే విక్రమ్ దర్శకత్వ ప్రతిభను సైతం ఆయన ప్రశంసల్లో ముంచెత్తారు.
రామ్ గోపాల్ వర్మ చేసిన ఆ ట్వీట్ లో ... ఇప్పుడే మనం సినిమాకి సంబందించిన కొన్ని సీన్స్ చూసాను. తెలుగు సినిమా ఓ స్ధాయికి వెళ్తున్నందకు చాలా హ్యాపీగా ఉంది. మనం అనేది చిత్రం యెక్క అసలైన ఫీల్..ఇలాంటి సినిమాని చూలా కాలం అయ్యింది. విక్రమ్ చాలాలా టాలెంట్ ఉన్న దర్శకుడు, ఇలాంటి దర్శకుడుని నేను గత కొద్ది సంవత్సరాలుగా కలవలేదు అని ట్వీట్ చేసారు. అలాగే కంటిన్యూ చేస్తూ..ఈ సినిమా కోసం డిజైన్ చేసిన అక్కినేని, నాగార్జున, చైతన్య లుక్ చాలా ప్రెష్ గా ఉంమది. సినిమా అభిమానులు విక్రమ్ కోసం ఈ చిత్రం చూడవచ్చు అన్నారు.

అలాగే ఈ చిత్రం రిలీజ్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఉగాది కానుకగా విడుదల చేయటానికి నిర్ణయించుకున్నట్లు తాజా సమాచారం. ఈ చిత్రం రషెష్ చూసిన అక్కినేని చాలా హ్యాపీ ఫీలయినట్లు చెప్తున్నారు. ఆయనకు అనారోగ్యం బయిటపడటంతో హడావిడిగా దర్శకుడు చేసారని భావించిన అక్కినేని తన పోర్షన్ ని మరోసారి చూసి సంతృప్తి చెందారని, అవసరమైతే మళ్లీ ఆ సీన్స్ చేస్తానని దర్శకుడుతో అన్నట్లు చెప్పుకుంటున్నారు. అయితే దర్శకుడు తాను అనుకున్నట్లే వచ్చాయని చెప్పారని సమాచారం.
శ్రీమతి అన్నపూర్ణ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి. పతాకంపై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ఇష్క్ మూవీ ఫేం విక్రమ్ కుమార్ 'మనం' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మనం గురించి నిర్మాత నాగార్జున మాట్లాడుతూ..' నాన్న, నేను, చైతన్య కలిసి నటిస్తున్న ఈ చిత్రం నాకు కొత్త అనుభూతి కలిగిస్తోంది. మా బేనర్లో ఈ చిత్రం ఓ ప్రెస్టీజియర్ చిత్రం అవుతుంది' అన్నారు.
దర్శకుడు విక్రమ్ కుమార్ మాట్లాడుతూ...'నాగేశ్వరరావు గారు, నాగార్జునగారు, నాగచైతన్య కలిసి నటించే చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. పెద్దలు నాగేశ్వరరావుగారి ఆశీస్సులతో ఈచిత్రాన్ని చేస్తున్నాను. ఫస్ట్ లుక్ గెటప్స్ డిఫరెంటుగా ఉన్నట్లుగానే సినిమా కూడా చాలా డిఫరెంటుగా ఉంటుంది' అన్నారు. వందశాతం కామెడీతో మంచి లవ్ ఫీల్‌తో మంచి ఎమోషనల్‌తో 'మనం' చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది. నాగేశ్వరరావు గారికి 90 ఏళ్లు వచ్చినా సెట్‌లో అందర్నీ నవ్విస్తూ ప్లెజెంట్ ఎట్మాస్పియర్‌ని క్రియేట్ చేస్తారు. యూనిట్లో అందరికంటే ఎనర్జిటిక్‌గా ఉంటూ అందరినీ ఉత్సాహపరుస్తారు. ఆయనొక లెజెంట్. లెజెండ్ తో కలిసి పని చేయడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి అని చెప్పుకొచ్చారు దర్శకుడు.
ఈచిత్రంలో సమంత, శ్రీయ హీరోయిన్లు. బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అలీ, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణ మురళి, నాగినీడు, శరణ్య, కాశీవిశ్వనాథ్, రవిబాబు, వెన్నెల కిషోర్, మెల్కొటే ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈచిత్రానికి మాటలు : హర్షవర్ధన్, పాటలు : చంద్రబోస్, వనమాలి, డాన్స్ : బృంద, ఫైట్స్ : విజయ్, కాస్ట్యూమ్స్: నళిని శ్రీరామ్, ఫోటోగ్రఫీ : పి.ఎస్.వినోద్, సంగీతం : అనూప్ రూబెన్స్, ఆర్ట్ :రాజీవన్, ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వై.సుప్రియ, నిర్మాత : నాగార్జున అక్కినేని, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : విక్రమ్ కె.కుమార్.


Click it and Unblock the Notifications











