వర్మ దర్శకత్వంలో జె.డి?

By Staff
JD Chakravarthi
రామ్ గోపాల్ వర్మ తన ప్రియ శిష్యుడు జె.డి చక్రవర్తి ఓ ప్రధాన పాత్రగా సినిమా చెయ్యబోతున్నారనే వార్త బాలీవుడ్ లో గుప్పుమంది. ఇంతకు ముందు జె.డి తో ఆయన రూపొందించిన సత్యం సంచలన విజయం సాధించటమే కాక విమర్శకుల ప్రసంసలు సైతం పొందటంతో బాలీవుడ్ ఈ కాంబినేషన్ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తోంది. అయితే వర్మ ...జెడి ల మధ్యం కొన్ని పర్శనల్ మిస్ అండర్ స్టాండిగ్స్ చోటు చేసుకోవటంతో తర్వాత ఏ ప్రాజెక్టూ మెటీరిలైజ్ కాలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ ఇద్దరూ కలసి అనగనగనగా ఓ రోజు తరహా కామిక్ థ్రిల్లర్ ని తెరకెక్కించాలని డిసైడ్ అయ్యారుట.అన్నీ అనుకూలిస్తే అక్టోబర్ నుండి ఈ సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఇక జె.డి డైరక్ట్ చేసిన హోమం సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. జగపతి బాబు ప్రధాన పాత్రలో చేసిన ఈ చిత్రం హాలీవుడ్ హిట్ డిపార్టెడ్ ఆధారంగా నిర్మిస్తున్నారు. అలాగే యండమూరి తులసీ దళం ఆదారంగా రాము రూపొందించిన ఫూంక్ త్వరలో జనాన్ని భయపెట్టనుంది.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X