»   » వర్మపై కుర్ర హీరో రాజ్ తరుణ్ సంచలన కామెంట్స్

వర్మపై కుర్ర హీరో రాజ్ తరుణ్ సంచలన కామెంట్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇప్పటి వరకు వర్మ మాత్రమే తన ట్విట్టర్ ద్వారా సంచలన కామెంట్స్, వివాదాస్పద కామెంట్స్ చేయడం మనకు తెలుసు. కానీ ఈ సారి వర్మకే పంచ్ పడింది. ఆ వ్యాఖ్యలు చేసింది ఓ కుర్ర హీరో. ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మావ సినిమాలతో వరుస విజయాలు అందుకున్న రాజ్ తరుణ్ నెక్ట్స్ రామ్ గోపాల్ వర్మతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

ట్విట్టర్లో రాజ్ తరుణ్ వర్మతో సినిమా చేయడంపై వ్యాఖ్యానిస్తూ.... రామ్ గోపాల్ వర్మతో సినిమా చేస్తున్నాను. కానీ వర్మ ప్రస్తుతం జస్ట్ ఓకే ఓ డైరెక్టర్. నేను డైరెక్టర్ అయితే రంగీల, శివ కంటే బెటర్ సినిమాలు చేస్తాను. బస్ట్ స్టిల్ ఆర్జీవీ ఓకే ఓకే అంటూ ట్వీట్ చేసాడు.

 RGV just a ok ok director

రాజ్ తరుణ్ నటిస్తున్న ‘కుమారి 21 ఎఫ్' వివరాల్లోకి వెళితే..
దర్శకుడు సుకుమార్ తొలిసారిగా నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న చిత్రం ‘కుమారి 21 ఎఫ్'. నిర్మాతగా వ్యవహరించడంతో పాటు కథ, స్క్రీన్‌ప్లే, మాటలు కూడా ఆయనే అందిస్తున్న ఈ చిత్రానికి పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్, అండ్ పీఏ మోషన్ పిక్చర్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కుతోంది. సుకుమార్ సమర్పణలో విజయ్ ప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి ఆదూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

 RGV just a ok ok director

ఉయ్యాలా జంపాలా, సినిమా చూపిస్త మామ చిత్రాలతో యూత్‌లో మంచి గుర్తింపును పొందిన రాజ్‌తరుణ్ ఈ చిత్రంలో కథానాయకుడు. హేభ పటేల్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఆర్య, రోబో, వన్, లింగా వంటి ప్రతిష్టాత్మక చిత్రాలకు ఛాయాగ్రాహకుడిగా పనిచేసిన రత్నవేలు ఈ చిత్రానికి ఫోటోగ్రఫీని అందిస్తుండటం విశేషం.

రాజ్‌తరుణ్, హేభ పటేల్, నోయల్, నవీన్, సుదర్శన్ రెడ్డి, భాను, హేమ, కమల్, తాగుబోతు రమేష్, జోగిబ్రదర్స్, సత్య, కౄఎష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, సినిమాటోగ్రఫీ: రత్నవేలు, ఆర్ట్: బి.రామచంద్రసింగ్, ఎడిటర్: అమర్ రెడ్డి, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, కొరియోగ్రఫీ: ప్రేమ్ రక్షిత్, శంకర్, నిక్సన్, సమర్పణ: సుకుమార్, నిర్మాతలు: విజయ్ ప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి ఆదూరి,కథస్కీన్‌ప్లే-మాటలు: సుకుమార్, దర్శకత్వం: పల్నాటి సూర్య ప్రతాప్.

English summary
"I am doing a film with RGV ...i think he's just a ok ok director ..my pet name for him is Appa Rao" Raj Tarun tweeted.
Please Wait while comments are loading...