Just In
- 1 hr ago
మెగా 152: వైరల్ అవుతున్న చిరంజీవి లుక్.. లీక్ అయినట్లేనా?
- 1 hr ago
ధోనీపై స్టార్ హీరో కామెంట్.. ఆయనో ‘దబాంగ్’ ప్లేయర్’ అంటూ!
- 3 hrs ago
నా ప్రపంచమే అతను.. కొద్దిరోజుల్లోనే మీ ముందుంచబోతున్నా: రాశిఖన్నా
- 3 hrs ago
ఫైటర్ హీరోయిన్ ఫిక్స్: విజయ్‌కు జోడీగా స్టార్ డాటర్.. అడ్వాన్స్‌గా అంత ఇచ్చారా.!
Don't Miss!
- Automobiles
కొత్త లగ్జరీ ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించనున్న మెర్సిడెస్ బెంజ్
- News
నిర్భయ దోషులను ఉరితీస్తా.. అమిత్ షాకు లేడీ షూటర్ నెత్తుటి లేఖ
- Sports
అబ్బాయిపై దాడి.. భారత మాజీ క్రికెటర్‌పై కేసు నమోదు!!
- Lifestyle
వైరల్ : కదిలే గుర్రాన్ని గెలికితే.. ఏమవుతుందో ఈ వీడియోలో మీరే చూడండి...
- Finance
24x7 NEFT: ఆ గంటలో మాత్రం కుదరదు, ఛార్జీలు, ఆయా బ్యాంకు పరిమితులు
- Technology
టాటా స్కై బింగే + సెట్-టాప్-బాక్స్ ఎలా ఉందొ చూడండి
- Travel
మీ పిల్లలను అలరించడానికి ఈ బీచ్‌లకు వెళ్లండి!
కొడుకు మీద ప్రేమతో పార్టీని నాశనం.. బుడ్డోడు లాగేసుకోకపోతే.. ట్రైలర్‌తో ఆర్జీవీ చిచ్చు
కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అంటూ రామ్ గోపాల్ వర్మ పెట్టిన రగడ రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఆర్జీవీ చిత్రాలేవీ ఏవైనా సరే వివాదాల వల్లో చిక్కుకోవాల్సిందే. వివాదాల నుంచే సినిమాలను తెరకెక్కించే వర్మ.. ప్రతీది ఓ సెన్సేషన్ అయ్యేట్టుగానే జాగ్రత్తగా ప్రమోట్ చేస్తుంటారు. ఇప్పటికే పోస్టర్, టీజర్, ట్రైలర్‌తో బాంబ్‌లు వేయగా.. తాజాగా మరో ట్రైలర్‌తో చిచ్చు పెట్టాడు. ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
|
బుడ్దోడు లాగేసుకోకపోతే..
ఆర్జీవీ వాయిస్ ఓవర్‌తో మొదలయ్యే ఈ రెండో ట్రైలర్ అందర్నీ ఆకట్టుకుంటోంది. ‘హఠాత్తుగా జరిగిన ఎవ్వరూ ఊహించని రాజకీయ పరిణామాలతో పిచ్చెక్కిపోయి, తమ మనుగడకే ముప్పొచ్చిందన్న నిస్పృహలో పడిపోయారు ఓడిపోయిన పార్టీకి సంబంధించిన తండ్రీ కొడుకులు' అంటూ ప్రారంభమైన ఈ ట్రైలర్లో ‘ఇలాంటి వాతావరణంలో ఇంకో ఐదేళ్లు కష్టమే. అప్పటికి మీకు 75 సంవత్సరాలు వస్తాయి... ఈలోగా మన పార్టీని ఆ పొట్టోడు లాగేసుకోకపోతే...' అన్న డైలాగులు హైలెట్ అవుతున్నాయి. ఆపై ‘కొడుకు మీద ప్రేమతో పార్టీని మొత్తం నాశనం చేశారు' అన్న డైలాగ్, అసెంబ్లీలో వైఎస్ జగన్‌ను పోలిన క్యారెక్టర్, చంద్రబాబును తలపించే పాత్రను హెచ్చరించడం, కొన్ని క్రైమ్ సీన్స్ ఈ ట్రయిలర్‌కే ఆకర్షణగా నిలిచాయి.

ట్రైలర్‌ను రిలీజ్ చేసిన వర్మ
‘సినిమాల్లో నటించి, మీకు సేవ చేయడంలో ఉన్న విలువైన కాలాన్ని వృథా చేయనని మీకు హామీ ఇస్తున్నాను'అన్న పవన్ కల్యాణ్ పాత్రధారి డైలాగ్ కూడా వినిపిస్తోంది. "వాళ్ల నాన్న గంగవీటి గంగా గారిని మర్డర్ చేయించింది మనమేనని తెలిసి కూడా మన పార్టీలో చేరారు" అన్న లోకేశ్ పాత్రధారి డైలాగ్ అదిరిపోయి ఉంది. ఈ ట్రైలర్‌ను రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో రిలీజ్ చేశాడు.

ఇప్పటికే పాటలతో సంచనాలు..
ఈ చిత్రంలోని కేఏ పాల్ మీద చిత్రీకరించిన పాట వైరల్ కాగా.. పప్పులాంటి అబ్బాయి పాట సెన్సేషన్‌గా మారింది. వర్మ తన స్టైల్లో ప్రమోట్ చేయగా.. ఈ మూవీపై భారీ హైప్ క్రియేట్ అయింది. విడుదలకు ముందే ఈ మూవీ ఇంతటి సంచలనాలు నమోదు చేస్తుండగా.. రిలీజ్ అయ్యాక ఎలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ నెల 29న చిత్రం విడుదల కానుంది.

మరో ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించిన వర్మ..
విజయవాడ రౌడీలు, రాయలసీమ ఫ్యాక్షనిజంపై సినిమాలు చేశాను.. ఇక ఇప్పుడు హైద్రాబాద్ దాదాల మీద చిత్రీకరిస్తాను అంటూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు ఆర్జీవీ. జార్జిరెడ్డి చిత్రంతో పలకరించబోతోన్న సందీప్ మాధవ్ ముఖ్య పాత్రలో నటిస్తాడని తెలిపాడు. మరి ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పుడు ప్రకటిస్తాడో చూడాలి.