twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లక్ష్మీస్ ఎన్టీఆర్: ఆర్జీవికి 25 కోట్ల రెమ్యునరేషన్.. టిడిపి నుంచి 50 కోట్ల ఆఫర్!

    |

    దర్శకుడు రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హంగామా మొదలైపోయింది. అయినా కూడా ఈ చిత్రం కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మి పార్వతి ప్రవేశించిన తర్వాత జరిగిన ఎపిసోడ్ ని వర్మ ఈ చిత్రంలో చూపించబోతున్నాడు. ఎన్ని బెదిరింపులు ఎదురైనా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని విడుదల చేసి తీరుతానని వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్జీవిపై అనేక రాజకీయ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలపై చిత్ర నిర్మాత రాకేష్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.

    300 ఎకరాల భూస్వాములం

    300 ఎకరాల భూస్వాములం

    తాను మధ్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తిని అని, ఒక సినిమాని నిర్మించే ఆర్థిక స్థోమత, స్థాయి తనకు లేవని వస్తున్న కామెంట్స్ పై లక్ష్మీస్ ఎన్టీఆర్ నిర్మాత రాకేష్ రెడ్డి స్పందించారు. కేవలం పేరుకు మాత్రామే నిర్మాతగా మిమ్మల్ని పెట్టి వైసిపి పార్టీనే లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని నిర్మిస్తోందని వార్తలు వస్తున్నాయి. ఎంతవరకు నిజం అని ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్ ప్రశ్నించగా రాకేష్ రెడ్డి స్పందించారు. మా తాతల కాలం నుంచే మాది ధనిక కుటుంబం, బెంగుళూరులో బాగా సెటిల్ అయ్యాం. తాము 300 ఎకరాల భూస్వాములం అని, కావాలంటే మా ఆస్తి లెక్కలు మీకు చూపిస్తానని రాకేష్ రెడ్డి అన్నారు.

     నాకు సినిమా తీసే రేంజ్ లేదా

    నాకు సినిమా తీసే రేంజ్ లేదా

    తాతల నుంచి వచ్చిన ఆస్తులతో ప్రస్తుతం బెంగుళూరులో వ్యాపారాలు చేసుకుంటూ బాగా సెటిల్ అయ్యాం. చిత్ర నిర్మాణంపై ఆసక్తి కలిగి పలువురు దర్శకులని సంప్రదించినట్లు రాకేష్ రెడ్డి తెలిపారు. నాకు సినిమా తీసే రేంజ్ లేదనే వాళ్లకు ఇదే నా సమాధానం అని రాకేష్ రెడ్డి అన్నారు. మా కుటుంబం మొత్తానికి ఎన్టీఆర్ అంటే చాలా అభిమానం. అలా వర్మ ఎన్టీఆర్ చరిత్ర గురించి సినిమా తీస్తున్నట్లు తెలిసి ఆయన్ని కలిశానని, అలా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని నిర్మించే అవకాశం తనకు దక్కిందని రాకెష్ రెడ్డి తెలిపారు.

    25 కోట్ల రెమ్యునరేషన్

    25 కోట్ల రెమ్యునరేషన్

    లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని తెరకెక్కించడం వలన వైసిపి నుంచి వర్మకు 25 కోట్ల రెమ్యునరేషన్ అందిందని, ఆయన అప్పులని కూడాతీర్చేశారని వస్తున్న వార్తలపై రాకేష్ రెడ్డి స్పందించారు. అందరి రాజకీయ నాయకుల గురించి ఓ విషయం చెబుతా. ఏ రాజకీయ నాయకుడు అంత డబ్బు ఖర్చు చేయరు. వేరే వాళ్ళ చేత ఖర్చు పెట్టించుకుంటారు. వర్మకు అంత రెమ్యునరేషన్ ఇవ్వాల్సిన అవసరం వైసీపీకి లేదని అన్నారు. తాను వ్యాపారవేత్తని కాబట్టి ఎంతోకొంత డబ్బు ఖర్చు చేస్తున్నానని అన్నారు.

    టిడిపి నుంచి 50 కోట్లు

    టిడిపి నుంచి 50 కోట్లు

    నాకు కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని ఆపేసేందుకు చంద్రబాబు వర్మకు 50 కోట్లకు ఆఫర్ చేసారని వార్తలు వచ్చాయి. వర్మ గురించి ఇలాంటి వార్తలు అనేకం వస్తుంటాయని, కానీ ఆయన దమ్మున్న దర్శకుడు అని రాకేష్ రెడ్డి అన్నారు. వర్మకు ఎలాంటి అప్పులు లేవని,ఆయన పెద్ద డైరెక్టర్.. పైగా వ్యాపారాలు కూడా ఉన్నాయి. అలాంటి వ్యక్తికి అప్పులు ఎందుకు ఉంటాయి అని వర్మ అన్నారు.

    English summary
    RGV Lakshmi's NTR Movie Producer Rakesh Reddy Reveals Chandrababu Naidu Offer to Varma
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X