నా కెరీర్ మొత్తంలో ఇదే నా బెస్ట్ ఫ్రేమ్.. చాలా గర్వపడుతున్నా.. నగ్నం స్టిల్ పై RGV

విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే అనేలా తనదైన శైలిలో క్రేజ్ అందుకుంమ విషయం తెలిసిందే. అయితే ఈ మధ్య బోల్డ్ మసాలా సినిమాలను క్యాష్ చేసుకుంటున్న వర్మ నిజంగా సక్సెస్ అయ్యాడా లేదా అన్నది పెద్ద మిస్టరీ అనే చెప్పాలి. ఆయన చేస్తున్న సినిమాల్లో పెద్దగా ఆకట్టుకునే అంశాలు అయితే ఉండడం లేదు. అయితే ఆల్ మోస్ట్ బీ గ్రేడ్ సినిమాలను తలపించేలా ఫ్రేమ్స్ సెట్ చేస్తున్న ఆర్జీవి రీసెంట్ గా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక ఫోటో వైరల్ అవుతోంది.

నా బెస్ట్ ఫ్రేమ్..

నా బెస్ట్ ఫ్రేమ్..

శ్రీ రాపాకతో చేసిన నగ్నం సినిమాలోని ఒక సీన్ కి సంబంధించిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసిన వర్మ తన కెరీర్ లోనే అదొక బెస్ట్ ఫ్రేమ్ అని ఇది తనకు చాలా గర్వంగా అనిపించిందని వివరణ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. నగ్నం సినిమాలో వర్మ ఎంతవరకు సక్సెస్ అందుకున్నాడో తెలియదు గాని ప్రమోషన్స్ చేయడంలో మాత్రం బాగానే సక్సెస్ అయ్యాడు. ఇక వర్మ ట్వీట్ పై నెటీజన్స్ ఉహీంచని విధంగా స్పందిస్తున్నారు.

ఓ వర్గం వారికి నచ్చడం లేదు..

ఓ వర్గం వారికి నచ్చడం లేదు..

శివ, సత్య, సర్కార్, వంటి ఎన్నో ఎవర్ గ్రీన్ హిట్స్ అందుకున్న రామ్ గోపాల్ వర్మ అంటే ప్రతి ఒక్క దర్శకుడికి ఎంతో గౌరవం. ఆయన్ను చూసి సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన యువ దర్శకులు ఎంతో మంది ఉన్నారు. కేవలం ఒక దర్శకుడిగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా వర్మ లైఫ్ స్టైల్ ని ఫాలో అయ్యే వారు చాలా మంది ఉంటారు. కానీ అలాంటి దర్శకుడు ఇప్పుడు ఈ విదంగా నడుచుకోవడం ఓ వర్గం వారికి నచ్చడం లేదు.

ఎలా ఉండేవాడివి ఎలా అయిపోయావు..

ఎలా ఉండేవాడివి ఎలా అయిపోయావు..

ఎలా ఉండేవాడివి ఎలా అయిపోయావు వర్మ అంటూ నెటీజన్స్ ఆయన చేసిన ట్వీట్ పై కామెంట్స్ చేస్తున్నారు. ఇదే నా కెరీర్ బెస్ట్ ఫ్రేమ్ అంటూ ఒక బూతు పోస్టర్ ని వర్మ పోస్ట్ చేయడంపై విభిన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఇలాంటి సినిమాలు కాకుండా మీ నుంచి మంచి థ్రిల్లర్ అండ్ హర్రర్ మూవీస్ ని కోరుకుంటున్నట్లు వర్మ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

Recommended Video

Deepika Padukone Offers Prayers @ Shree Siddhivinayak Temple Ahead Of ‘Chhapaak’ Release
ఇంకా.. ఎన్ని క్రియేట్ చేస్తాడో..

ఇంకా.. ఎన్ని క్రియేట్ చేస్తాడో..

ఇక వర్మ నగ్నం లాంటి బోల్డ్ సినిమాలు మరిన్ని చేయబోతున్నట్లు తెలుస్తోంది. మియా మాల్కోవాతో మరోసారి వర్క్ చేస్తానని అలాగే శ్రీ రాపాకతో కూడా ఇంకా సినిమాలు చేయాల్సి ఉందని అన్నాడు. ఇక రీసెంట్ గా అప్సర రాణి అనే మరొక హీరోయిన్ ని ప్రమోట్ చేసిన ఆర్జీవి ఆమెతో కూడా థ్రిల్లర్ అనే బోల్డ్ సినిమా చేయబోతున్నట్లు తెలిపాడు. మరి ఆ సినిమాలలో ఎలాంటి ఫ్రేమ్ లు క్రియేట్ చేస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X