త్వరలో రామ్ గోపాల్ వర్మ ‘సింగిల్ ఎక్స్’ (ఫోటో)
హైదరాబాద్: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో ప్రయోగానికి తెర తీసాడు. త్వరలో ‘ఆర్జీవీ టాకీస్' పేరుతో ఆన్ లైన్ థియేటర్ లాంచ్ చేయబోతున్నట్లు తెలిపారు. తొలి చిత్రంగా తాను తీసిన ‘మిస్టర్ ఎక్స్' అనే షాట్ ఫిల్మ్ ను రిలీజ్ చేయనున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు. యూట్యూబ్ ఛానల్ ద్వారా వర్మ వీటిని రిలీజ్ చేయబోతున్నారు.
ఆన్ లైన్ లో రిలీజ్ చేయడం వల్ల సెన్సార్ బోర్డు నిబంధనలు అడ్డురావు, అలాగే నిడివి ఇంతే ఉండాలనే విషయంలో కూడా ఇబ్బంది ఉండదని చెప్పారు వర్మ. ఆర్జీవీ టాకీస్ లో కేవలం నా సినిమాలు మాత్రమే కాదు....వేరే వారు తీసిన సినిమాలైనా సరే, నా టేస్టుకు తగిన విధంగా ఉండే ఇతరుల సినిమాలు కూడా రిలీజ్ అవుతాయి. త్వరలోనే నేను తీస్తున్న ‘సింగిల్ ఎక్స్' సినిమాకు సంబంధించిన షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేస్తాను అన్నారు వర్మ.
ఆర్జీవీ టాకీస్ లో ఎరోటిక్, క్రైమ్, హారర్ ఇలా వివిధ జేనర్లలో సినిమాలు రిలీజ్ అవుతాయి. అదే విధంగా దేవుడిపై కూడా మా ఇష్టమైనట్లు సినిమాలు చేస్తాం. ఎందుకంటే నేను దేవుడిని నమ్మను కాబట్టి. ఆర్జీవి టాకీస్ లో స్పోర్ట్స్ కు సంబంధించిన సినిమాలు అస్సలు ఉండవు. ఎందుకంటే నాకు స్పోర్ట్స్ అంటే అసహ్యం కాబట్టి అన్నరు వర్మ.
ఆర్జీవి టాకీస్ లో రొమాంటిక్ కామెడీస్, సెక్స్ కామెడీస్ ఎట్టి పరిస్థితుల్లోనూ రిలీజ్ కావు. ఎందుకంటే లవ్, సెక్స్ రెండింటినీ నేను చాలా సీరియస్ గా తీసుకుంటాను కాబట్టి. ఆర్జీవీ టాకీస్ రిలీజ్ చేస్తున్నసింగిల్ ఎక్స్ ను సెన్సార్ బోర్డుకు కూడా పంపాలని నిర్ణయించుకున్నాను అని తెలిపారు వర్మ.
స్లైడ్ షోలోవర్మ ట్వీట్లు...
వర్మ ట్వీట్లు
వర్మ ట్వీట్లు
వర్మ ట్వీట్లు
వర్మ ట్వీట్లు
ఆర్జీవీ టాకీస్
ఆర్జీవీ టాకీస్
సింగిల్ ఎక్స్
సింగిల్ ఎక్స్
వర్మ
వర్మ
ట్వీట్
ట్వీట్
వర్మ ట్వీట్
వర్మ ట్వీట్
సింగిల్ ఎక్స్
సింగిల్ ఎక్స్
త్వరలో...
త్వరలో...


Click it and Unblock the Notifications











