MAA ISHTAM Trailer : రెచ్చిపోయిన నైనా గంగూలీ, అప్సరా రాణి.. మూతి ముద్దులే కాదు నెక్స్ట్ లెవెల్

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏ సినిమా చేసినా వింతగా ఉంటుంది. తెలుగులో మొట్టమొదటి ట్రెండ్ సెట్టర్ సినిమా అయిన శివని తెరకెక్కించిన ఆయన, ఇప్పుడు బోల్డ్ కంటెంట్ మీద పడుతున్నారు. ఎప్పుడూ ఎదో ఒక ప్రయోగం చేస్తూ తనకు నచ్చినట్లుగా సినిమా తీస్తా, ప్రేక్షకులకు నచ్చిందే చూస్తారు లేదంటే లేదు అని చెప్పే వర్మ.. ఈ సారి లెస్బియన్ క్రైమ్ డ్రామాను రూపొందిస్తున్నారు. గతంలో '' గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ (GST), క్లైమాక్స్'' లాంటి సినిమాలతో అడల్ట్ కంటెంట్ ప్రేక్షకుల ముందుకు తెచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆయన ఇప్పుడు 'డేంజరస్' పేరుతో లెస్బియన్ క్రైమ్ డ్రామా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. గతంలో ఓటీటీలో విడుదల చేయాలని భావించిన ఈ సినిమాని ఇప్పుడు థియేటర్లలో రిలీజ్ చేయడానికి గానూ తాజాగా రెండవ ట్రైలర్ విడుదల చేశారు.

 ఇండియాలోనే మొదటి లెస్బియన్ స్టోరీ

ఇండియాలోనే మొదటి లెస్బియన్ స్టోరీ


రాంగోపాల్ వర్మ ఎప్పటికప్పుడు ఏదో ఒక ప్రయోగం చేయాలని భావిస్తూ ఉంటారు. అందులో భాగంగానే భారతదేశంలోనే మొట్టమొదటి లెస్బియన్ చిత్రాన్ని ఆయన తెరకెక్కించారు. ఈ మూవీ కోసం హాట్ బ్యూటీలు నైనా గంగూలీ, అప్సరా రాణిలను రంగంలోకి దించారు వర్మ. ఇండియాలో తొలి లెస్బియన్ మూవీగా ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది.

 రెండో ట్రైలర్

రెండో ట్రైలర్


ఇక చిత్ర ప్రమోషన్స్ విషయంలో ఎప్పుడూ సరికొత్తగా ఆలోచిస్తూ తనదైన దారిలో వెళ్లే ఆయన 'డేంజరస్' ట్రైలర్ రిలీజ్ చేసి ఒక్కసారిగా అందరి చూపు తన సినిమా వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. నిజానికి ఈ సినిమాని గతంలో ఓటీటీలో విడుదల చేయాలని భావించారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మెరుగవడం థియేటర్లు పెద్ద ఎత్తున ఓపెన్ కావడంతో సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని భావిస్తున్నారు.

రొమాన్స్ ఎక్కువగా

రొమాన్స్ ఎక్కువగా


అందులో భాగంగానే గత ఏడాది విడుదల చేసిన ట్రైలర్ తో పాటు ఇప్పుడు రెండవ ట్రైలర్ విడుదల చేశారు. 2 నిమిషాల 50 సెకనుల నిడివితో కూడిన ఈ ట్రైలర్‌లో నైనా గంగూలీ, అప్సరా రాణిల రొమాన్స్ హైలైట్ చేశారు. మధ్య మధ్యలో థ్రిల్లింగ్ సన్నివేశాలు జోడిస్తూ రొమాంటిక్ థ్రిల్లర్‌కి సరైన ఉదాహరణలా తీర్చిదిద్దారు.

యువతుల మధ్య ప్రేమ

యువతుల మధ్య ప్రేమ


రష్మీ, నళిని అనే ఇద్దరు యువతుల మధ్య ప్రేమ మొదలై వారికి డబ్బు అవసరమైతే దాని కోసం వాళ్ళు ఏం చేశారు? అసలు వాళ్ల లవ్ స్టోరీ ఏంటి? వాళ్లిద్దరూ ఎందుకు అలా మారారు? వాళ్ళు క్రైంలో ఎందుకు చిక్కుకున్నారు? ఇలా విషయాల మీద కాస్త ఎక్కువ ఫోకస్ చేసినట్లు కనిపించింది.

Recommended Video

RRR Team Reacts On Memes పడి పడి నవ్విన Ram Charan, Jr NTR | Filmibeat Telugu
పేరు మార్చిన వర్మ

పేరు మార్చిన వర్మ


ఇక ఈ సినిమాను గతంలో డేంజరస్ అని సంబోధిస్తూ రాగా ఇప్పుడు మా ఇష్టం అనే టైటిల్ ఫిక్స్ చేసి దానికి డేంజరస్ అనే ట్యాగ్ లైన్ పెట్టారు.. ప్రేమ ఎవరి మధ్య ఎప్పుడైనా మొదలు కావచ్చు అంటూ ఈ ట్రైలర్ లో చూపించడం ద్వారా ఈ సినిమా ఎలా ఉండబోతుందో కూడా హింట్ ఇస్తున్నారు. ఏప్రిల్ ఎనిమిదవ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎలా ఉండబోతోంది అనేది థియేటర్లలో విడుదల అయితే గాని చెప్పలేం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X