'పెళ్ళి' టైటిల్ రామ్ గోపాల్ వర్మ కొత్త చిత్రం
రామ్ గోపాల్ వర్మ త్వరలో తాను 'పెళ్ళి' టైటిల్ తో ఓ చిత్రం చేయబోతున్నట్లు చెప్పారు. అప్పలరాజు ప్లాప్ అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ తన వద్ద రకరకాల సబ్జెక్టులతో సినిమాలు చేసేందుకు స్క్రిప్టులు రెడీ గా ఉన్నాయని, అందులో ఒకటి వివాహ వ్యవస్ధపైన అని అన్నారు. ఇక అప్పలరాజు చిత్రానికి సీక్వెల్ చేయటం ఖాయమని చెప్పుకొచ్చారు. అలాగే తన తాజా చిత్రం దొంగల ముఠా ..మార్చి 18 న విడుదల చేయటానికి రెడీ అవుతోందని అన్నారు.
అలాగే దొంగల ముఠా చిత్రం తక్కువ రోజుల్లో తీసారు కదా..ఎలా సాధ్యమైంది అన్నదానికి సమాధానంగా...తక్కువ, ఎక్కువ అనేది తీస్తున్నదానిపై దర్శకుడికి ఉండే అవగాహనపై ఆధారపడి ఉంటుంది. ఇంగ్లీషులో 'గ్లాడియేటర్' సినిమాను 45రోజుల్లో తీశారు. నాకు తెలిసి కెమెరామెన్ సరిగ్గా తీయలేకపోతే సినిమా ఆలస్యమవుతుంది. లేదంటే స్క్రిప్ట్ రెడీకాక పోవటం. నటీనటుల వల్ల ఆలస్యమనేది ఎప్పుడూ ఉండదు అన్నారు. 'దొంగల ముఠా' చిత్రం షూటింగ్ మొదటే చెప్పినట్లుగా కేవలం ఐదు రోజుల్లో ,కేవలం ఎనిమిది మంది క్రూ మెంబర్స్ తో దిగ్విజయంగా పూర్తి చేసారు.


Click it and Unblock the Notifications