ఆ హీరో సినిమా ప్లాప్ అంటూ వర్మ నెగిటివ్ ఎస్సెమ్మెస్ లు..వివాదం
ప్రముఖ దర్సకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా మరో వివాదంలో ఇరుక్కున్నారు.అభిషేక బచ్చన్ హీరోగా చేసిన 'దమ్ మారో దమ్' సినిమా గురించి వర్మ అందరికీ నెగిటివ్ గా ఎస్సెమ్మెస్‌లు పంపిస్తున్నారనే కథనాన్ని ముంబయిలో కొన్ని పత్రికలు ప్రచురించాయి.ఈ సినిమా క్లైమాక్స్ లో ఓ ట్విస్టు ఉంటుందని దాన్ని తన సర్కిల్స్ లో అందరికీ పంపాడని,అలాగే అందులో మెయిన్ హీరో అభిషేక్ బచ్చన్ నటనపై నెగిటివ్ కామెంట్స్ చేసాడని చెప్తున్నారు.ఆయన సెల్ నుంచి ఎస్సెమ్మెస్ లు అందుకున్నవారు వర్మ ఇలా చీప్ గా ఓ సినిమాను రిలీజ్ కు ముందే కామెంట్స్ చేస్తారని ఊహించలేదని అంటున్నారు.అయితే వర్మ మాత్రం ఎప్పటిలాగే ...
మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు తెలియటం లేదు.నేను ఎస్సెమ్మెస్ లు ఎవరికీ పంపలేదు.అస్సలు నేను సినిమానే చూడలేదు అన్నారు.అంతేగాక తన తాజా చిత్రం 'డిపార్ట్‌మెంట్'లో అబిషేక్ బచ్చన్ ని తీసేసి ఆ ప్లేస్ లో రానాని తీసుకున్నారు. దానికి వివరణగా కాల్షీట్లు కుదరకపోవడం వల్ల అభి స్థానంలో రానాను తీసుకున్నామని చెప్పారు.కానీ ఇటీవల వరసగా వర్మ సినిమాలు భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ కావటంతో అభిషేక్ బచ్చన్ ఆయన చిత్రంలో నటించటానికి ఆసక్తి చూపలేదని అందుకే ఇలా వర్మ కసి తో చేసాడని అంటున్నారు


Click it and Unblock the Notifications











