»   » వర్మ మాయలో మంచు విష్ణు...న్యూడ్ బ్యూటీతో ‘12’

వర్మ మాయలో మంచు విష్ణు...న్యూడ్ బ్యూటీతో ‘12’

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'రౌడీ' సినిమా తర్వాత వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో మంచు విష్ణు మరో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. రామ్ గోపాల్ వర్మ కెరీర్లో ఇప్పటి వరకు వచ్చిన సినిమాలకు భిన్నంగా ఈ సినిమా ఉండబోతోంది. ఈ చిత్రంలో మంచు విష్ణు భార్యగా తేజస్వి నటిస్తోంది.

ఈ చిత్రానికి 'టెన్షన్ టెన్షన్' అనే టైటిల్ ఇప్పటి వరకు ప్రచారంలో ఉంది. అయితే ఆ చిత్రం టైటిల్ అది కాదని తేజస్వి తెలిపింది. దీనికి '12' అనే టైటిల్ ఖరారు చేసినట్లు ఆమె తెలిపారు. ఈ చిత్రంలో నవదీప్ ఓ చిన్న పాత్రలో నటిస్తున్నాడు. అతని పాత్ర చిన్నదయినా...ఎంతో కీలకమైన పాత్ర అని తెలుస్తోంది.

మంచు విష్ణు, తేజస్వి

మంచు విష్ణు, తేజస్వి


మంచు విష్ణుతో తేజస్వి తొలిసారి నటిస్తోంది. వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ ‘12'

వర్మ, మంచు విష్ణు

వర్మ, మంచు విష్ణు


‘రౌడీ' సినిమా తర్వాత దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో మంచు విష్ణు మరో సినిమా చేస్తుండటం, ఈ చిత్రం డిఫరెంటుగా ఉంటుందనే టాక్ రావడంతో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

తేజస్వి, నవదీప్ ఐస్ క్రీమ్

తేజస్వి, నవదీప్ ఐస్ క్రీమ్


ఇక తేజస్వి-నవదీప్ జంటగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఐస్ క్రీం'. ఈచిత్రం జులై 11న విడుదలవుతోంది.

నగ్నంగా తేజస్వి

నగ్నంగా తేజస్వి


‘ఐస్ క్రీమ్' చిత్రంలో తేజస్వి ఓ సన్నివేశంలో ఒంటిపై నూలు పోగు లేకుండా నగ్నంగా నటించింది. నగ్న సన్నివేశాన్ని చిత్రీకరించేటపుడు డైరెక్టర్, కెమెరామెన్ సహా యూనిట్ సభ్యులు ఎవరూ షూటింగ్ స్పాట్‌లో లేరు.

'12' సినిమా త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. రామ్ గోపాల్ వర్మ నుండి సినిమా వస్తుందంటే అందలో ఏదో వైవిధ్యం ఉంటుందని ప్రేక్షకులు ఎదురు చూస్తుంటారు. మరి ఈ సారి ఈ సినిమాలో వర్మ ఎలాంటి వైవిద్యం చూపెట్టబోతున్నారో చూడాలి.

ఇక తేజస్వి వర్మ దర్శకత్వంలో 'ఐస్ క్రీమ్' అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సభ్యులు స్వయంగా ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో నవదీప్ హీరోగా చేస్తున్నాడు. వర్మ మార్కు హారర్, సస్పెన్స్‌తో 'ఐస్ క్రీమ్' చిత్రం సాగుతుంది. జులై 11న ఈ చిత్రం విడుదల అవుతోంది.స

English summary

 Manchu Vishnu is again acting in the direction of Ram Gopal Varma after the moderately successful film, 'Rowdy'. Tejaswi Madivada plays Vishnu's wife in this film. The title of the movie is speculated to be 'Tension Tension' till now, but Tejaswi has confirmed that the title of the movie is '12'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu