లక్ష్మీస్ ఎన్టీఆర్: నిజాలు చెప్పిన మోహన్ బాబు, బూతులతో రెచ్చిపోయిన రామ్ గోపాల్ వర్మ

Recommended Video

RGV Met Mohanbabu,Uses Cuss Words On Chandrababu Naidu | Lakshmi's NTR

'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రానికి అటు ఎన్నికల కమీషన్ నుంచి విడుదలకు గ్రీన్ సిగ్నల్ లభించడంతో పాటు... సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. ఎలాంటి కట్స్ లేకుండా అన్ని వయసుల వారు చూడదగ్గ చిత్రంగా క్లీన్ 'యూ' సర్టిఫికెట్ లభించింది.

అటు ఈసీ గండంతో పాటు ఇటు సెన్సార్ గండం కూడా గట్టెక్కడంతో సినిమా విడుదల(మార్చి 29)పై ఉన్న అన్ని అడ్డంకలు తొలగిపోయినట్లయింది. దీంతో రామ్ గోపాల్ వర్మ.... తన ట్వీట్లకు మరింత పదును పెంచారు. బూతు పదాలు వాడుతూ రెచ్చిపోయారు.

చంద్రబాబు గురించి నిజం చెప్పిన మోహన్ బాబు!

చంద్రబాబు గురించి నిజం చెప్పిన మోహన్ బాబు!

సోమవారం రాత్రి రామ్ గోపాల్ వర్మ, మోహన్ బాబు మీట్ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గురించి మోహన్ బాబు పలు నిజాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. మోహన్ బాబు ద్వారా నిజం తెలుసుకున్నందుకు సంతోషంగా ఉంది అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశారు.

బూతులతో రెచ్చిపోయిన వర్మ

బూతులతో రెచ్చిపోయిన వర్మ

చంద్రబాబు ఇలాంటి వ్యక్తి అని తాను అస్సలు ఊహించలేదు అంటూ రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నారు. ఈ ట్వీట్లో ఆయన కొన్ని బూతు పదాలు కూడా వాడటం గమనార్హం. సినిమా రిలీజ్ వేళ కావాలనే వర్మ ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

వారికి చెంపదెబ్బ... మోహన్ బాబుకు క్లాప్స్

వారికి చెంపదెబ్బ... మోహన్ బాబుకు క్లాప్స్

మోహన్ బాబు చెప్పిన విషయాలు విన్న తర్వాత ఆయనకు క్లాప్స్ కొట్టకుండా ఉండేలేకపోయాను. అదే సమయంలో నా సినిమా ద్వారా వెన్నుపోటుదారుల చెంప పగలకొట్టినట్లు ఫీలవుతున్నట్లు వర్మ పేర్కొన్నారు.

రౌడీలకే రౌడీలం..

రౌడీలకే రౌడీలం..

మోహన్ బాబుతో కలిసి ఉన్న తన పిక్ షేర్ చేసిన ఆర్జీవీ... ‘రౌడీలకే రౌడీలు' అంటూ క్యాప్షన్ పెట్టారు. రామ్ గోపాల్ వర్మ చేసిన ఈ వరుస ట్వీట్లు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయ.

ఇద్దరూ ఏకం అయ్యారా?

ఇద్దరూ ఏకం అయ్యారా?

ఇటీవల తిరుపతిలో ప్రభుత్వం నుంచి రావాల్సిన కాలేజీ ఫీజు బకాయిల గురించి మోహన్ బాబు ధర్నా చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల వేళ మోహన్ బాబు కావాలనే చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచేందుకే ఇలా చేశారనే విమర్శలు వచ్చాయి. మరో వైపు రామ్ గోపాల్ వర్మ తన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ద్వారా చంద్రబాబును దెబ్బకొట్టాలనే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో మోహన్ బాబు, రామ్ గోపాల్ వర్మ మీటింగ్ హాట్ టాపిక్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X