దెబ్బకు సర్వర్ క్రాష్.. ‘క్లైమాక్స్’ డిమాండ్ మామూలుగా లేదే.. పన్నెండు గంటల్లోనే రికార్డ్ వ్యూస్
రామ్ గోపాల్ వర్మ అన్నంత పని చేసేశాడు. క్లైమాక్స్ చిత్రాన్ని శ్రేయాస్ ఎంటర్టైన్మెంట్ యాప్‌లో రిలీజ్ చేశాడు. అయితే క్లైమాక్స్‌కు ఉన్న డిమాండ్ చూసి అంతా అవాక్కయ్యారట. ఈ సినిమాను చూడటానికి వంద రూపాయలు చెల్లించాలని ముందుగానే రేటు ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. వీరు ముందుగా అనుకున్న దాని కంటే ఎన్నో రేట్ల మంది చూడటానికి ఎగబడ్డారట. దీంతో సర్వర్ కాస్తా క్రాష్ అయిందట. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Recommended Video

మియా మాల్కోవాతో సంచలనం..
శృంగార తార మియా మాల్కోవాతో ఆర్జీవీ సంచలనం సృష్టించడం ఇదేమీ మొదటి సారి కాదు. గతంలో జీఎస్టీ అంటూ పూర్తి నగ్న చిత్రాన్ని ఆన్ లైన్‌లో రిలీజ్ చేశాడు. ప్రస్తుతం క్లైమాక్స్ అంటూ ఓ రేంజ్‌లో సెగలు రేపాడు. అంతా కరోనా క్రైసిస్‌లో ఉంటే.. వర్మ మాత్రం క్లైమాక్స్‌లో మునిగి తేలాడు.

టీజర్, ట్రైలర్స్‌తో రచ్చ..
క్లైమాక్స్ చిత్రంపై అదిరిపోయే పబ్లిసిటీని డిజైన్ చేశాడు వర్మ. మెల్లిగా ఒక్కో పోస్టర్ వదులుతూ టీజర్ ట్రైలర్ పాటలతో మెల్లిగా జనాల్లోకి వెళ్లేలా చేశాడు. కరోనా లాంటి విపత్కర పరిస్థితిలోనూ తన సినిమా గురించి మాట్లాడుకునేలా చేశాడు.

వంద రూపాయలతో రేటు ఫిక్స్..
తన క్లైమాక్స్ చిత్రాన్ని కరోనా కాదు కదా దేవుడు కూడా ఆపలేడని చెబుతూ... సొంతంగా యాప్‌లోనే రిలీజ్ చేశాడు. ఈ మేరకు ఈ మూవీని చూడాలంటే ఒక్కరు ఒక్కసారి చూడాలంటే వంద రూపాయలు చెల్లించాలని రేటు ఫిక్స్ చేశాడు. దీంతో జూన్ 6 వీక్షించే వారి సంఖ్యను అంచనా వేశారు.

అంచనాలను మించి..
మొదటి రోజు యాభై వేల మంది చూస్తారని అనుకుంటే.. 2.75లక్షల మంది రెడీగా ఉన్నారట. అయితే ఈ దెబ్బకు సర్వర్ క్రాష్ అయిందంటా. అయినా కూడా దాదాపు 1.60 వేలకు పైగా మంది ఈ చిత్రాన్ని వీక్షించడంతో సరికొత్త రికార్డులను నెలకొల్పామని ప్రకటించారు. పన్నెండు గంటల్లోనే 1,68,596 మంది వీక్షించారని తెలిపారు.


Click it and Unblock the Notifications











