twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వర్మ-మోహన్ బాబు టైటిల్ 'ఒట్టు' కాదు

    By Srikanya
    |

     Ram Gopal Varma
    హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకుడుగా,మోహన్ బాబు నిర్మాతగా చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో ఓ చిత్రం రీసెంట్ గానే ప్రారంభమై, ఆ మేరకు పనులు జోరుగా జరుగుతున్నాయి. ఈ చిత్రానికి 'ఒట్టు' అనే టైటిల్ పెట్టారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ టైటిల్ కాకుండా 'అన్నగారు' అనే టైటిల్ ని పెడుతున్నట్లు సమాచారం. ఈ మేరకు మోహన్ బాబు కూడా టైటిల్ ఇంకా ఖరారు చేయలేదని చెప్పారు. ఈ సినిమాని రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు.

    మోహన్ బాబు మాట్లాడుతూ... రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాం. నా పోర్షన్ షూటింగ్ అయిపోయింది. విష్ణు పోర్షన్ నడుస్తోంది. ఫిబ్రవరి నెలాఖరుకల్లా ఫస్ట్‌కాపీ ఇస్తానన్నాడు వర్మ. అలాంటి డైరెక్టర్‌ని ఇంతదాకా నేను చూడలేదు. డైరెక్షన్ తప్ప అతనికి వేరే ధ్యాసే ఉండదు. విష్ణు కెరీర్‌లో బెస్ట్ సినిమాగా ఇస్తానని చెప్పాడు. అందులో నేను, విష్ణు తండ్రీ కొడుకులుగా నటిస్తున్నాం. 'అన్నగారు', 'రెస్పెక్ట్', 'ఒట్టు' అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి కానీ ఇంకా నిర్ణయించలేదు. నేను, వర్మ కలిసి చేస్తున్నామంటే చాలా మందికి ఆశ్చర్యం కలుగుతోందని మాకు తెలుసు. కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా సినిమా చేసుకుంటూ వెళ్తున్నాం అన్నారు.

    మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణు ఈ చిత్రంలో హీరోగా చేస్తున్నారు. మోహన్ బాబు ఊరి పెద్దగా పెద రాయుడు టైపులో ఈ పాత్ర ఉంటుందని చెప్పుకుంటున్నారు.
    ఇక అయితే ఇప్పుడిప్పుడే గాడిలో పడ్డ విష్ణు....వర్మ దర్శకత్వంలో సినిమా ఒప్పుకోవడంపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. వర్మ స్వార్థానికి విష్ణు బలి కాబోతున్నాడని కొందరు అభిప్రాయ పడుతున్నారు. వర్మ ఒకప్పుడు గొప్ప దర్శకుడే, ప్రేక్షకుల అభిరుచికి తగినట్లుగా సినిమాలు తీసిన దర్శకుడే అయినప్పటికీ.....ఈ మధ్య ఆయన మైండ్ సెట్ పూర్తిగా మారిందని, ప్రేక్షకుల అభిరుచికి విలువ ఇవ్వకుండా తన స్వార్థానికి...ఇష్టం వచ్చినట్లుగా సినిమాలు తీస్తూ ప్రేక్షకులను టార్చర్ పెడుతున్నాడని, అందుకు ఇటీవల వచ్చిన ఆయన సినిమాలే నిదర్శనమని అంటున్నారు.

    English summary
    
 Ram Gopal Varma’s upcoming Telugu film featuring Manchu Mohan Babu and Vishnu. Firstly, it was said that the film will be titled Anna and later it was named Ottu, but now we hear that the title has been changed to ‘Annagaru’.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X