»   » మోహన్ బాబు-విష్ణు ‘రౌడీ’ ఫస్ట్ లుక్ రేపు

మోహన్ బాబు-విష్ణు ‘రౌడీ’ ఫస్ట్ లుక్ రేపు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో 'రౌడీ' అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మోహన్ బాబు, విష్ణు ప్రధాన పాత్రధారుల పోషిస్తున్నారు. ఈ చిత్రం సూటింగ్ రీసెంట్‌గా ప్రారంభమైంది. మోహన్ బాబుకు జోడీగా జయసుధ, మంచు విష్ణకు జోడీగా శాన్వి నటిస్తున్నారు. ఏవి పిక్చర్స్ బేనర్లో పార్థ సారథి, గజేంద్ర, విజయ్ కుమార్ నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఈ నెల 21న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాని రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో పవర్ఫుల్ యాక్షన్ అండ్ పొలిటికల్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఎమోషన్ సీన్లతో పాటు హై ఓల్టేజ్ సన్నివేశాలు ఇందులో ఉంటాయని తెలుస్తోంది.

RGV and Mohan Babu’s ‘Rowdy’ first look

మోహన్ బాబు మాట్లాడుతూ... రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాం. నా పోర్షన్ షూటింగ్ అయిపోయింది. విష్ణు పోర్షన్ నడుస్తోంది. అలాంటి డైరెక్టర్‌ని ఇంతదాకా నేను చూడలేదు. డైరెక్షన్ తప్ప అతనికి వేరే ధ్యాసే ఉండదు. విష్ణు కెరీర్‌లో బెస్ట్ సినిమాగా ఇస్తానని చెప్పాడు. అందులో నేను, విష్ణు తండ్రీ కొడుకులుగా నటిస్తున్నాం. నేను, వర్మ కలిసి చేస్తున్నామంటే చాలా మందికి ఆశ్చర్యం కలుగుతోందని మాకు తెలుసు. కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా సినిమా చేసుకుంటూ వెళ్తున్నాం అన్నారు.

మోహన్ బాబు ఊరి పెద్దగా పెద రాయుడు టైపులో ఈ పాత్ర ఉంటుందని చెప్పుకుంటున్నారు. ఇక అయితే ఇప్పుడిప్పుడే గాడిలో పడ్డ విష్ణు....వర్మ దర్శకత్వంలో సినిమా ఒప్పుకోవడంపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. వర్మ స్వార్థానికి విష్ణు బలి కాబోతున్నాడని కొందరు అభిప్రాయ పడుతున్నారు. వర్మ ఒకప్పుడు గొప్ప దర్శకుడే, ప్రేక్షకుల అభిరుచికి తగినట్లుగా సినిమాలు తీసిన దర్శకుడే అయినప్పటికీ.....ఈ మధ్య ఆయన మైండ్ సెట్ పూర్తిగా మారిందని, ప్రేక్షకుల అభిరుచికి విలువ ఇవ్వకుండా తన స్వార్థానికి...ఇష్టం వచ్చినట్లుగా సినిమాలు తీస్తూ ప్రేక్షకులను టార్చర్ పెడుతున్నాడని, అందుకు ఇటీవల వచ్చిన ఆయన సినిమాలే నిదర్శనమని అంటున్నారు.

English summary
Mohan Babu and Vishnu Manchu’s intense and High Octane RGV directed Action film ROWDY first look will be out officially tomorrow. action sequences and song picturisation already canned.The movie Rowdy is produced by Parthasarathy, Gajendra and Vijaykumar
 of AV pictures.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu