»   »  రాయలసీమ నేపథ్యంలో...వర్మ చిత్రం మొదలైంది

రాయలసీమ నేపథ్యంలో...వర్మ చిత్రం మొదలైంది

Posted By:
Subscribe to Filmibeat Telugu
 RGV, Mohan Babu and Vishnu Manchu film launched
హైదరాబాద్: గతంలో ఫ్యాక్షనిజం నేపథ్యంతో రామ్‌గోపాల్‌వర్మ 'రక్తచరిత్ర' తీశారు. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆ చిత్రాలు అప్పట్లో పలు వివాదాల్ని సృష్టించాయి. ఆదరణ కూడా పొందాయి. ఇప్పుడు మరోసారి ఆయన రాయలసీమ నేపథ్యంలో ఓ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు. మంచు విష్ణు హీరోగా నటించనున్న ఆ చిత్రం గురువారం హైదరాబాద్‌ సాయిబాబా టెంపుల్ లో లాంఛనంగా మొదలైంది.

ఈ చిత్రంలో మోహన్‌బాబు కీలక పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. ఇది రాయలసీమ నేపథ్యంలో సాగే కథ అని సినిమా వర్గాలు చెబుతున్నాయి. మరి... వర్మ ఇంకోసారి తెరపై ఫ్యాక్షనిజాన్ని చూపించబోతున్నారా లేదా కేవలం ఆ నేపథ్యాన్ని మాత్రమే వాడుకొంటున్నారా అన్నది తేలాల్సి ఉంది.

అలాగే ఈ చిత్రం పూర్తి స్ధాయి కామెడీతో సాగుతుందని ఫిల్మ్ నగర్ లో వినపడుతోంది. వర్మ గతంలో రూపొందించిన మనీ,అనుకోకుండా ఒక రోజు,క్షణ క్షణం తరహాలో ఎంటర్టైన్మెంట్ ని మిక్స్ చేసి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని, స్టోరీ లైన్ విని వెంటనే మోహన్ బాబు ఈ చిత్రం చేయటానికి ఆసక్తి చూపించారని అంటున్నారు. ఈ చిత్రంలో రెజీనా హీరోయిన్ గా కనిపించనుంది. అయితే ఈ కొత్త చిత్రం విషయమై రామ్ గోపాల్ వర్మ నుంచి ఏ విధమైన ప్రకటన లేదు. 2014 జనవరి నుంచి ప్రారంభం అయ్యే అవకాసం ఉంది.

ఇక అయితే ఇప్పుడిప్పుడే గాడిలో పడ్డ విష్ణు....వర్మ దర్శకత్వంలో సినిమా ఒప్పుకోవడంపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. వర్మ స్వార్థానికి విష్ణు బలి కాబోతున్నాడని కొందరు అభిప్రాయ పడుతున్నారు. వర్మ ఒకప్పుడు గొప్ప దర్శకుడే, ప్రేక్షకుల అభిరుచికి తగినట్లుగా సినిమాలు తీసిన దర్శకుడే అయినప్పటికీ.....ఈ మధ్య ఆయన మైండ్ సెట్ పూర్తిగా మారిందని, ప్రేక్షకుల అభిరుచికి విలువ ఇవ్వకుండా తన స్వార్థానికి...ఇష్టం వచ్చినట్లుగా సినిమాలు తీస్తూ ప్రేక్షకులను టార్చర్ పెడుతున్నాడని, అందుకు ఇటీవల వచ్చిన ఆయన సినిమాలే నిదర్శనమని అంటున్నారు.


మరి అలాంటి దర్శకుడితో విష్ణు సినిమా చేసే ముందు కాస్త ఆలోచిస్తే బాగుంటుందని అంటున్నారు. కాగా...'దూసుకెళ్తా' విజయంతో మంచి జోష్ మీద ఉన్న విష్ణు ప్రస్తుతం తన తండ్రి మోహన్ బాబు, తమ్ముడు మనోజ్‌తో కలిసి 'పాండవులు పాండవులు తుమ్మెద' చిత్రంలో నటిస్తున్నాడు.

English summary

 Director Ram Gopal Varma has joined hands with the Manchu family to launch a new film that stars Collection King Mohan Babu and Manchu Vishnu. The movie was reportedly launched today morning with puja ceremony at the Shirdi Sai temple, Film Nagar, Hyderabad which ran as a hush-hush affair. While RGV himself is going to direct the film while the producer and other details are yet to be announced.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu