'నా ఇష్టం' అంకితం నాకేఎందుకంటే.. వర్మ(పుస్తకావిష్కరణ విశేషాలు)
ఎంతో ఆసక్తి రేపిన రామ్ గోపాల్ వర్మ పుస్తకం నా ఇష్టం నిన్న(డిసెంబర్ 1, బుధవారం) సాయింత్రం ఏడున్నరకు తాజ్ బంజారాలో ఆవిష్కతమైంది. ఎమోస్కో వారు పబ్లిష్ చేసిన ఈ పుస్తకాన్ని వర్మ కాలేజ్ మేట్, స్నేహితుడు అయిన లగడపాటి రాజ్ గోపాల్ ఆవిష్కరించి, వర్మ తల్లి కి అందచేసారు. మొదటిసారిగా వర్మ తల్లి సత్యవతి స్టేజీ మీదకు వచ్చారు. ఈ సందర్బంగా లగడపాటి మాట్లాడుతూ..అక్కడ గెస్ట్ గా వచ్చిన జయసుధకి రామూ,తానూ అభిమానులమని,చాలా సార్లు ఇద్దరూ కలిసి సినిమాలు చూసామని, జయసుధ అంటే వర్మకు ఇష్టమని, శ్రీదేవి అంటే మోజు అని అన్నారు. అలాగే పుస్తకం తనకే అంకితం చేసుకోవటం గురించి కామెంట్ చేస్తూ..ఎవరు సంపాదించుకున్న ఆస్ధి వారికే చెందుతుందని, అలాగే ఈ పుస్తకం వర్మ ఆస్తే కాబట్టి వర్మకే అంకితం చేసుకోవటంలో అర్దం ఉందన్నారు.
ఇక జయసుధ మాట్లాడుతూ..తానూ రామ్ గోపాల్ వర్మ అంత కాకపోయినా ఆయనలో ట్వంటీ పర్శంట్ అయినా నా ఇష్టం వచ్చినట్లు బ్రతికానని, త్వరలోనే తాను కూడా మీ ఇష్టం అనే పుస్తకం రాస్తానని చమత్కరించారు.అనంతరం కృష్ణ వంశీ మాట్లాడుతూ..వర్మ ఇంతకు ముందు శ్రీదేవి అంటే ఇష్టమన్నాడని, ఇప్పుడు జయసుధ అంటే ఇష్టమన్నాడని, దాంట్లోనే కావల్సినంత కాంట్రడిక్షన్ ఉందని, అలాగే తాను రామూ దగ్గర పనిచేయటం తన అదృష్టమని అన్నారు. రవి తేజ ఒకే ఒక్క వాక్యంలో రామ్ గోపాల్ వర్మ నా ఇష్టం...అంకితం నాకే అన్నారు అందుకే ఆయనంటే ఇష్టం అన్నారు.
జయసుధ, రవితేజ, కృష్ణ వంశీ, బి గోపాల్ ,సునీల్ వంటి సెలబ్రేటీలు హాజరైన ఈ పంక్షన్ లో అందరూ వర్మ గురించి మాట్లాడారు. ఇక వర్మ మాత్రం జయసుధ గురించి మాట్లాడారు. అలాగే ఈ పుస్తకం తనకే అంకితం చేసుకుంటున్నానని, ఎందుకంటే ప్రపంచంలో తాను ఎక్కువ ఇష్టపడే వ్యక్తి తాను కాబట్ట్ అలా చేసానని అన్నారు.అలాగే తాను ఏంటనది ఈ అంకితంలోనే తెలుస్తుందని, అలాగే ప్రపంచంలో తన లాగా జీవితంలో ప్రతీ క్షణం అనుభవించే వ్యక్తి ఇప్పటివరకూ కనపడలేదని చెప్పారు. అలాగే ఈ పుస్తకాన్ని చదివి, ఇందులో అంశాలను జీవితంలోకి తెచ్చుకుంటే జీవితం మారుతుందని, లేకుంటే వారి కర్మ అని అన్నారు. ఇక నా ఇష్టం పుస్తకం ఆయనపై వచ్చిన ఆర్టికల్స్, ప్రశ్నలు, జవాలులు, ఆయనకు చెందిన అరుదైన ఫొటోలు, ఆయనపై ప్రముఖుల అభిప్రాయాలు వంటివాటితో నిండి ఉంది.


Click it and Unblock the Notifications











