వర్మ, ప్రకాష్ రాజ్ చిత్రం టైటిల్ 'రాజకీయం' ని మార్చారు
రామ్ గోపాల్ వర్మ, ప్రకాష్ రాజ్ ల కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రానికి "రాజకీయం" అనే టైటిల్ ని వర్మ కుర్చీ గా మార్చేసారు. ఈ విషయాన్ని ట్విట్టర్ లో తెలియచేస్తూ...రాజకీయం కన్నా కుర్చీ అనే టైటిల్ కరెక్టు గా యాప్ట్ అవుతుందనిపించింది అన్నారు. ఇక రెండు రోజుల క్రితమే ఈ చిత్రానికి హీరోగా ప్రకాష్ రాజ్ ని ఎంపిక చేసినట్లు వర్మ ట్వీట్ చేసారు. దాంతో ప్రకాష్ రాజ్ కూడా ట్వీట్ లో...దుబాయి నుంచి వచ్చి ఆర్ జివి జూమ్ లో ట్వీట్ చూసాను. మీతో పనిచేయటం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది అని రిప్లై ఇచ్చారు. ఇక ఈ చిత్రం గురించి వర్మ చెబుతూ..బయట జరుగుతున్న రాజకీయ పరిస్ధితులని చూస్తుంటే తనకు "రాజకీయం" అనే టైటిల్ తో ఓ చిత్రం చేయాలని తీవ్రమైన కోరిక పుట్టిందని అన్నారు. "రాజకీయం" కథ రాజకీయ మెకానిజం గురించి, రాజకీయ సైకాలజీల గురించి చర్చిస్తుందని చెప్పారు. అలాగే ప్రస్తుత రాష్టంలో రాజకీయం గురించి వింటూంటే వెనక ఏం జరుగుతోంది, ముందుకు ఏం కనపడుతోందని అనేది చూస్తే అండర్ వరల్డ్ పాలిటిక్స్ ఎక్కువగా ఉన్నాయని, అలాగే పాలిటిక్స్ లో అండల్ వరల్డ్ వాతావరణం ఎక్కువగా ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. ఇక తను చేసిన కంపెనీ చిత్రం అండర్ వరల్డ్ పాలిటిక్స్ ని చూపితే, సర్కార్..ఫ్యామిలీ పాలిటిక్స్ ని చర్చిందని, ఇప్పుడు పొలిటికల్ పాలిటిక్స్ ని చూపాలని నిర్ణయించుకున్నానని అన్నారు.


Click it and Unblock the Notifications











