మీడియా నేపధ్యంలో రామ్ గోపాల్ వర్మ రూపొందించనున్న రణ్ చిత్రానికి గజనీ చిత్రం నిర్మాతల్లో ఒకరిగా వ్యవహించిన మంతెన మధు తో కలసి పనిచేయనున్నారు. మధు నిజానికి వర్మ కు కజిన్ అవుతారు. అలాగే మధు గతంలో రోడ్ సినిమా నుండి వర్మ కార్పోరేషన్ లో మార్కెటింగ్ చూసేవారు. తర్వాత హృతిక్ రోషన్ క్రిష్ సినిమా ఓనర్ సీస్ మార్కెట్ చూసి రికార్డ్ సృష్టించారు. ఆ తర్వాత అల్లు అరవింద్,అమీర్ ఖాన్ లతో కలసి గజనీ రూపొందించి అంతటా ప్రశంసలు అందుకుంటున్నారు. ఇక ఈ రణ్ చిత్రంలో అమితాబ్,రితీష్ దేశ్ ముఖ్,పరేష్ రావెల్,రీమా సేన్ వంటి వారు ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. పిబ్రవరిలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమై కంటిన్యూగా రెండు నెలల్లో షూటింగ్ పార్ట్ పూర్తి చేయాలని వర్మ సంకల్పిస్తున్నారు. అన్ని అనుకూలిస్తే..వచ్చే జూలైకి ఈ సినిమా రిలీజు చేసే ఆలోచనలో ఉన్నారు.