రాము సార్ కి ఆయన సినిమా చూసే ప్రేక్షకులంతా వెర్రి వాళ్ళనే కాన్ఫిడెన్స్ బాగా పెర్గిపోతోంది. లేకపోతే రక్ష సినిమా పబ్లిసిటీ మరీ జనాన్ని వెధవలను చెయ్యటానికి కాకపోతే ఇలా చేస్తాడా అని ఓ పేరున్న (పేరెందుకు లెండి) దర్శకుడు మండిపడుతున్నాడు. ఇంతకీ ఆయన ఘోష ఏమిటంటే టీవీ ల్లో రక్ష సినిమా పబ్లిసిటీ కోసం ఒ కాంటెస్ట్ పెడుతున్నారు. అందులో ప్రశ్న...రక్ష ఏ జెనర్ కి సంభంధించిన సినిమా అని ...క్రింద సమాధానాల్లో హర్రర్ లేదా ప్యామిలీ ఫ్లిక్ లేదా సెంటిమెంట్ ఫ్లిక్ అని ఎ,బి,సి లతో మల్టిఫుల్ ఛాయిస్ తో ఉంటుంది. రాసి పంపిన వారికి యాభై వేల రూపాయలు గిప్ట్ ఇస్తారట. ఇంతకీ ఈ సినిమా హిందీ వెర్షన్ ఫూంక్ హర్రర్ కాదు ...కామిడీ అని తేలిపోయింది కదా. ఆయన ఆ ఉద్దేశంతో ఈ ఛాలెంజిగ్ కాంటెస్ట్ పెట్టి ఉంటాడు అని కొందరు వెటకారం చేస్తున్నారు. సినిమా చూస్తేనే గానీ తెలియదు నిజంగా హర్రరా...లేక టెర్రరా అనేది...