RGV మిస్సింగ్ కేసులో చంద్రబాబు, కేసీఆర్, మెగా ఫ్యామిలీస్.. అందరిని వాడేస్తున్న వర్మ!

విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే అనే మాట ఇప్పుడు సరిపోదేమో అనిపిస్తోంది. ఆయన ఆలోచించే విధానం ఇప్పుడు అంతకు మించి అనేలా ఉంది. వర్మ ఇన్నేళ్ల కెరీర్ లో కెమెరా ముందు ఎన్నడు కూడా యాక్టింగ్ చేయలేదు. పవర్ స్టార్ సినిమాతో అది కూడా చేసేశాడు. అయితే నెక్స్ట్ ఈ దర్శకుడు మరో డిఫరెంట్ జానర్ ని పరిచయం చేస్తూ తనపైనే ఒక సినిమా చేయబోతున్నాడు. అందులో మెగా ఫ్యామిలీతో పాటు కేసీఆర్, చంద్రబాబు వంటి వారిని కూడా వాడేస్తున్నారు.

టాప్ మోస్ట్ పొలిటీషియన్స్

టాప్ మోస్ట్ పొలిటీషియన్స్

మొన్నటివరకు క్లైమాక్స్, నగ్నం, పవర్ స్టార్ అనే సినిమాలతో తన RGV వరల్డ్ బ్రాండ్ పెంచుకున్న వర్మ నెక్స్ట్ సినిమాలు అంతకంటే హై రేంజ్ లో సరికొత్త కాంట్రవర్సీ క్రియేట్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. మెయిన్ గా సినిమాకు సంబంధించిన రియాలిటీ పాత్రలతోనే వర్మ షాక్ ఇస్తున్నాడు. ఇక నెక్స్ట్ టాప్ మోస్ట్ పొలిటీషియన్స్ ని టచ్ చేయబోతున్నాడు.

వర్మ FR అనే కొత్త జోనర్

వర్మ FR అనే కొత్త జోనర్

వర్మ FR అనే కొత్త జోనర్ టచ్ చేస్తున్నాడు. ఫిక్షనల్ రియాలిటీ అనే ఆ న్యూ జానర్ లో కథలు కల్పితలైనా ఉండవచ్చు, లేకపోతే నిజ జీవితాలకు దగ్గరగా ఉండవచ్చు అని వివరణ ఇచ్చాడు. వ్యక్తులపై రూపొందించిన పాత్రలను తనదైన శైలిలో ఫిక్షనల్ స్టోరీలో నిజమైన ఘటనలుగా చూపించడానికి ఈ సరికొత్త జోనర్ ని వాడుతున్నట్లు వర్మ ట్వీట్ చేశాడు.

 ఆర్జీవి మిస్సింగ్..

ఆర్జీవి మిస్సింగ్..

ఆర్జీవి మిస్సింగ్ అనే కొత్త సినిమాపై క్లారిటీ ఇచ్చిన వర్మ.. RGV ఎలా తప్పిపోయాడు అనే కాన్సెప్ట్ తో రానుందట. తన కంపెనీ స్టాఫ్ పోలీసులకు సమాచారం ఇస్తే.. వాళ్ళు పబ్లిసిటీ కోసం ఇలా చేస్తుంటారని అనుకుంటారట. కానీ అది నిజమేనని, మెగా ఫ్యామిలీ ముంబై అండర్ వరల్డ్ కు కాంట్రాక్ట్ ఇస్తుందని అలాగే పవర్ఫుల్ స్టార్ అభిమానులు దాని వెనక ఉంటారని, మాజీ సీఎం, అతను కొడుకు కూడా ఫ్యాక్షనిస్టుల సహాయంతో ఆర్జీవిని ఎత్తుకెళతారు అనే పాయింట్స్ ని వర్మ చూపిస్తారట.

Recommended Video

Adire Abhi Opinion On RGV || గొప్ప సినిమాలు తీసిన మీరు.. ఇప్పుడేంటి ఇలా.?
షాకిచ్చే విషయాలు బయటపడతాయి

షాకిచ్చే విషయాలు బయటపడతాయి

ఇక ఆ సినిమాలో ఉండే పాత్రలపై కూడా వర్మ క్లారిటీ ఇచ్చాడు. పోలీసులకు దర్యాప్తులో షాకిచ్చే విషయాలు ఎన్నో బయటపడతాయని సినిమాలో ఉండే పేర్లను వర్మ ఎలాంటి రాకుండా తెలివిగా ఎనౌన్స్ చేశాడు. Prawan Kalyan, Omega Star, CBEN, LAKESH, WHY S Jagan, KCAR, KTAR.. వంటి ప్రధాన పాత్రలు ఉంటాయని అంటూ.. ఇవి పోలీసులు, గ్యాంగ్‌స్టర్స్, ఫ్యాక్షనిస్టులు కూడా ఉంటారని RGV వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X