Don't Miss!
- News షర్మిలపై జగన్ కామెంట్స్ ! చంద్రబాబు కౌంటర్-సజ్జల ఎన్ కౌంటర్..!
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports అతని వల్లే RCB టైటిల్ చేజారింది- అనిల్ కుంబ్లే
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
దివ్య జీవితంపై రామ్ గోపాల్ వర్మ‘నాట్ ఎ సూసైడ్’!
వాస్తవంగా జరిగిన సంఘటనలను తెరకెక్కించడంలో ఆరితేరిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ..ఇప్పటికే పలు వాస్తవ సంఘటనలకు సినిమా రూపం ఇచ్చారు. పరిటాల, సూరి జీవితాల ఆధారంగా రక్త చరిత్ర సినిమాను తెరకెక్కించిన వర్మ....నిన్నగాక మొన్న'మారియా సుసైరాజ్" కేసుకు సంబంధించి 'నాట్ ఎ లవ్ స్టోరీ" సినిమాను తెరకెక్కించారు.
తాజాగా వర్మ మరో ఆసక్తికరమైన వాస్తవ సంఘటనను తెరకెక్కించే పనిలో ఉన్నట్లు తెలుస్తూంది. ఆ మధ్య అనుమానాస్పదంగా మరణించిన హీరోయిన్ 'దివ్యభారతి" జీవితంపై వర్మ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకు 'నాట్ ఎ సూసైడ్" అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తూంది.
దివ్యభారతి మరణం వెనక అనేక వదంతులు ఉన్నాయి. ఆమె ఆత్మహత్య చేసుకుందని కొందరు, తాగిన మత్తులో మేడ పై నుంచి పడిపోయిందని కొందరు, హత్య చేయబడిందని మరికొందరు..ఇలా రకరకాల వాదనలు ఉన్నాయి. దివ్యజీవితంపై చాలా మంది సినిమా తీయాలని ప్రయత్నిస్తున్నారు. అయితే వర్మ మాత్రం....దివ్య మరణించిన రోజు రాత్రి ఏం జరిగిందనే అంశాన్ని బేస్ చేసుకుని ఈ సినిమా స్క్రిప్టును తయారు చేసుకున్నట్లు సమాచారం.