చిరంజీవిని వదిలేసి రజనీకాంత్ మీద పడ్డ రామ్ గోపాల్ వర్మ
రామ్ గోపాల్ వర్మ గత కొద్ది రోజులుగా మెగాస్టార్ చిరంజివి మీద ట్విట్టర్ లో ఏదో ఒక కామెంట్ చేస్తూ కాలం గడిపారు. అటువైపు నుంచి ఏ విధమైన రెస్పాన్స్ రాకపోవటంతో దానికి ఫుల్ స్టాప్ పెట్టి ఇప్పుడుస ఆల్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ పై పడ్డారు. ఆయనపై ఆయన ఓ జోక్ ట్వీట్ చేసారు. ఆయన ఏం రాసారంటే..రజనీకాంత్ సిగెరెట్ కాలిస్తే...సిగెరెట్ కు లంగ్ కాన్సర్ వస్తుందని. ఇది పాత జోకే అయినా ఎప్పుడూ ఎవరి విషయంలో వేలు పెట్టకుండా తన పని తాను చేసుకుపోయే రజనీ పై కామెంట్ చేయటం వర్మకు ఎంతవరకూ సబబు అంటున్నారు. ఇక వర్మ తాజా చిత్రం రక్త చరిత్ర-2 ...డిసెంబర్ మూడవ తేదీన విడుదల కానుంది.
రామ్ గోపాల్ వర్మ చిరంజివి ట్విట్టర్ రజనీకాంత్ జోక్ ram gopal varma chiranjeevi twitter rajanikanth joke


Click it and Unblock the Notifications