twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బూతులు తిట్టి...హీరోను దువ్వుతున్న వర్మ

    By Bojja Kumar
    |

    రామ్ గోపాల్ వర్మ..వివాదాలకు మారుపేరు మాత్రమే కాదు, మనోడి దగ్గర ఎకశకాలు కూడా ఎక్కువే. తనను ఎవరైనా ప్రశ్నిస్తే, తన సమాధానంతో ఎదుటి వారిని తికమక పెట్టే గడుసరి. ఎవరు ఏమనుకున్నా సరే నేను చేసే కరెక్టు అనే మొండి ఘటం. అలాంటి రామూజీ కూడా తప్పు చేశాడు. ఎలాంటి వ్యక్తయినా ఏదో ఒక సందర్భంలో తప్పు చేస్తాడు. రామ్ గోపాల్ వర్మ అందుకు అతీతుడేమీ కాదు. ఆ మధ్య బుడ్డా హోగా తెర బాప్ ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ వచ్చిన అమితాబ్ అదే రోజు రాత్రి రాంగోపాల్ వర్మ, పూరిజగన్నాథ్ తో కలిసి పార్టీ చేసుకున్నారు. అప్పడు ఏం గొడవ జరిగిందో ఏమో? మరి తాగిన మత్తులో రాశాడో? లేక కావాలని చేశాడో కానీ ఆదే రోజు రాత్రి...అమితాబ్ లాంటి వ్యక్తిని చెప్పడానికి వీలేని బూతులు(చూతియా అంటూ) తిడుతూ తన ట్విట్టర్ లో ఫోస్టులు చేశాడు వర్మ. ఈ విషయం అప్పట్లో చర్చనీయాంశం అయింది.

    ఇప్పడు ఆ విషయం అంతా మరిచి పోయారునుకోండి. చాలా ఆలస్యంగా తన తండ్రిని గురించి వర్మ చేసిన పోస్టును గమనించిన అభిషేక్ బచ్చన్ వర్మను ఉద్దేశించి మరో పోస్టు చేశాడు. 'వెరీ నైస్ రామూ...నీ అసలైన మనసుతో రాశావు" అంటూ పేర్కొన్నాడు. ఈ సమయంలో తాను తెలివగా వ్యవహరించకపోతే బచ్చన్ కుటుంబంతో తనకు లింకు తెగి పోతుందని అనుకున్నాడో ఏమోగానీ...దీనికి ఆచితూచి మళ్లీ రిప్లయ్ ఇచ్చాడు రాము. 'అప్పుడప్పుడు తప్పులు జరుగుతుంటాయి సార్...నా మనసు కూడా అప్పడప్పుడు మిస్టేక్ చేస్తుంది" అంటూ సమాధానం ఇచ్చాడు. మరి వర్మ దువ్వుడు ప్రయత్నం ఎంత మేరకు ఫలిస్తుందో చూడాలి...

    English summary
    Ram Gopal Varma had once come up with few tweets in his Twitter profile and addressed the legendary Big B as ‘Chootiya’. Those who read the essay say this will work as ointment. In fact, Amitabh's son Abhishek also gave a tweet which is as follows - “Very nice Ramu… Well written and from the heart”.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X