'బెజవాడ'లో తన ఇన్వాల్వ్ మెంట్ లేదని తేల్చిన వర్మ
'బెజవాడ'లో నా ఇన్వాల్వ్‌మెంట్ జీరో. స్క్రిప్టు, క్యారెక్టరైజేషన్, సాంగ్స్ .. ఇలా ప్రతి విషయమూ వివేక్‌దే అంటున్నారు రామ్ గోపాల్ వర్మ. ఆయన నిర్మిస్తున్న 'బెజవాడ' చిత్రం ఈ వారంలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందిచారు. అలాగే కథ నేపధ్యం గురించి వివరిస్తూ.. 'బెజవాడ' నగర నేపథ్యంలో, నేను కాలేజీ చదువుకున్నప్పుడు నాకు తెలిసిన విషయాల గురించి 'బెజవాడ' అనే సినిమా తీద్దామనే ఆలోచన వచ్చింది. వెంటనే అనౌన్స్‌మెంట్ ఇచ్చా. అది చూసి వివేక్ నా దగ్గరికి వచ్చి 'సార్ మీరు అనౌన్స్ చేసిన టైటిల్‌కి... నేను ఒక కథ అనుకుంటున్నాను' అన ఆ కథ చెప్పడంతో నేను ఎంతో ఇన్‌స్ఫైర్ అయ్యా. ఎంతో కష్టపడి స్క్రిప్టు తయారుచేసుకున్నాడు. నన్ను ప్రొడ్యూస్ చేయమని కోరడంతో ఒప్పుకున్నా. సో... ఈ సినిమా టోటల్ క్రియేషన్, క్రెడిట్ వివేక్‌దే అన్నారు.
అలాగే 'శివ' సినిమాతో 'బెజవాడ' ని పోల్చలేమన్నారు. దర్శకుడుకి ఈ చిత్రం విషయమై ఏమీ సలహా ఇవ్వలేదు.ఒకవేళ ఇచ్చినా అతను ఉపయోగించుకోడు. ఈ గతంలో నాగార్జునతో చేసిన 'శివ' చిత్రం ఆయనకు ఎంతో గుర్తింపునిచ్చింది. అంతటి ఇమేజ్‌ని 'బెజవాడ' చిత్రం నాగచైతన్యకు తెస్తుందని అనుకోవచ్చా? ఒకదానితో ఒకటి కంపేర్ చేయలేం. కానీ డెఫినెట్లీ వివేక్ స్టైల్‌లో ఇది 'శివ' లాంటి సినిమానే అన్నారు.


Click it and Unblock the Notifications











