దానికి కారణం లగడపాటి రాజగోపాల్ :వర్మ
''ఎవరికీ భయపడే నైజం కాదు నాది.అలాంటప్పుడు పేరు ఎందుకు మార్చాల్సివచ్చిందని కొందరు అడుగుతున్నారు. దానికి కారణం లగడపాటి రాజగోపాల్. తను నా మిత్రుడు.'నీ కారణంగా పదిమంది హర్ట్ అవ్వకూడదు"అని తను చెప్పడంతో కాదనలేకపోయాను.అందుకే టైటిల్ మార్చాను""అన్నారు వర్మ.ఆయన చిత్రం 'బెజవాడ"త్వరలో విడుదల కాబోతోంది.ఈ సందర్భంగా శనివారం ఆయన మీడియాను కలిసి మాట్లాడుతూ ఇలా స్పందించారు.అలాగే సినిమా చెయ్యటానికి కారణం చెపుతూ..''బెజవాడ నగరంతో నాకు చాలా అనుబంధం ఉంది.నాలుగైదేళ్ల పాటు అక్కడే నేను చదువుకున్నాను. కాబట్టి అక్కడి పరిస్థితులపై నాకు పూర్తి అవగాహన ఉంది. దాంతో ఆ నేపథ్యంలో సినిమా చేయాలి అనుకున్నాను.కథ కూడా రెడీ చేసుకున్నాను.అంతలో వివేక్ ఈ కథ వినిపించాడు.నేను అనుకున్న లైన్ మీద ఇది హండ్రెడ్ పర్సంట్ బాగుంది అనిపించింది.అందుకే తనకు అవకాశం ఇచ్చాను అన్నారు.దర్శకుడిగా ఆత్మసంతృప్తినిచ్చే సినిమా చేయాలనుకుంటున్నానని, ప్రస్తుతం బాలీవుడ్‌లో తాను రూపొందిస్తున్న 'డిపార్ట్‌మెంట్" ఆ కోవకు చెందిన చిత్రమేనని, 'డిపార్ట్‌మెంట్" తర్వాత ఓ క్యూట్ లవ్‌స్టోరీ డెరైక్ట్ చేయాలనుకుంటున్నానని వర్మ తెలిపారు.


Click it and Unblock the Notifications











