»   » పెద్ద ప్రొడ్యూసర్ ఇలా చేస్తే నమ్మలేదు, ఇండస్ట్రీ నుండి తరిమేస్తానన్నాడు: వర్మ

పెద్ద ప్రొడ్యూసర్ ఇలా చేస్తే నమ్మలేదు, ఇండస్ట్రీ నుండి తరిమేస్తానన్నాడు: వర్మ

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    టాలీవుడ్లో శ్రీరెడ్డితో పాటు పలువురు ఆర్టిస్టులు కాస్టింగ్ కౌచ్ అంశంపై మాట్లాడుతూ, ఇండస్ట్రీకి చెందిన పలువురి భాగోతాలు బయట పెడుతూ సంచలనం క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ..... ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని, ఓ సారి ఓ పెద్ద నిర్మాత హీరోయిన్‌ను కమిట్మెంట్ అడగటంతో తాను కూడా షాకయ్యానని వర్మ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

    పెద్ద నిర్మాత, రిపుటేషన్ ఉన్న నిర్మాత

    పెద్ద నిర్మాత, రిపుటేషన్ ఉన్న నిర్మాత

    హైదరాబాద్‌లో నేను ఒక నటిని కలిశాను. నాతో మాట్లాడుతూ ఆమె హైదరాబాద్‌లో చాలా ఫేమస్ ప్రొడ్యూసర్ గురించి షాకింగ్ విషయం చెప్పింది. అవకాశం కోసం వెళితే నన్ను కాంప్రమైజ్ అవ్వాలి అని అడిగాడని ఆమె చెప్పడంతో నిజంగా షాకయ్యాను, ఆయన నాకు బాగా తెలుసిన పెద్ద నిర్మాత, రిపుటేషన్ ఉన్న నిర్మాత , ఆయన ఇలా మాట్లాడతారని నేను కూడా అస్సలు ఊహించలేదు... అని వర్మ తెలిపారు.

    ఫోన్ చేసి నా ముందే అతడి బండారం బయట పెట్టింది

    ఫోన్ చేసి నా ముందే అతడి బండారం బయట పెట్టింది

    నేను నమ్మక పోవడంతో....వెంటనే ఆ అమ్మాయి ఆ నిర్మాతకు ఫోన్ చేసి స్పీకర్ ఫోన్ పెట్టి వినిపించింది. ‘‘నిన్న మీ ఆఫీసుకు వచ్చినపుడు కాంప్రమైజ్ అవ్వాలన్నారు, అదేంటో అర్థం కాలేదు అని ఆ నిర్మాతను అడిగింది. నీకు అంతా తెలుసుకదా అంటూ రిప్లై ఇచ్చారు. లేదండీ నాకు అర్థం కాకనే అడుగుతున్నాను....డబ్బుల విషయంలో కాప్రమైజ్ కావాలా? అని అడిగింది. అదేం లేదు డీసెంట్ అమౌంట్ ఇస్తాను, ఎంత కావాలో నువ్వే చెప్పు అని అటు నుండి ఆయన అన్నాడు. ఇంకేంటండి కాంప్రమైజ్ అంటే? నా రోల్ మంచిది కాదా? అంటే అదేం కాదు అని అతడు మరోసారి అన్నాడు. కాంప్రమైజ్ అంటే మీతో పడుకోవాలనా? అని ఈవిడ అనగానే... నీకు అన్నీ తెలిసి మళ్లీ నన్ను అడుగుతావేంటి? అన్నాడు....... ఈ ఫోన్ సంబాషణ విన్న తర్వాత తాను షాకయ్యానని వర్మ తెలిపారు.

     వారిని ఇండస్ట్రీ నుండి తరిమేస్తానన్నాడు

    వారిని ఇండస్ట్రీ నుండి తరిమేస్తానన్నాడు

    హీరోయిన్‌ను ఎంపిక చేసేది హీరో, లేదా డైరెక్టర్.... మీతో పడుకుంటే వారు ఎలా ఛాన్స్ ఇస్తారు? అంత పెద్ద హీరో, అంత పెద్ద డైరెక్టర్ ఎలా ఒప్పకుంటారు అని ఈమె మరోసారి అడగ్గానే అటు వైపు నుండి నిర్మాత నా మాట వినకపతే వారిని ఇండస్ట్రీ నుండి తరిమేస్తాను అంటూ వారి పేర్లు చెబుతూ రిప్లై ఇచ్చాడు. తను ఫైనల్‌గా ఏ విషయం ఆలోచించుకని రేపు చెబుతాను అని చెప్పి ఫోన్ కట్ చేసింది. ఫోన్ మాట్లాడిన తర్వాత ఇదంతా రికార్డు చేశానని చెప్పింది. ఆ రికార్డ్ యూట్యూబ్ లో పెడితే వైరల్ అయిపోయ్యేది.... అని వర్మ చెప్పుకొచ్చారు.

     మగజాతి అంతే

    మగజాతి అంతే

    ఇలా ప్రతి అమ్మాయి ఫోన్లో అందరి సీక్రెట్లు ఉంటాయి. మీరు ఊహించలేరు. మొన్న వచ్చిన శ్రీరెడ్డి దగ్గర కూడా అలాంటివే ఉన్నాయి. కానీ చాలా మంది అమ్మాయిలు ఎవరూ కూడా బయటకు రారు. నేను మీకు చెప్పిన సంఘటన రెండేళ్ల క్రితం జరిగింది. సినిమా ఇండస్ట్రీ అనే కాదు, మగవాళ్ల జాతి అంతే..... అని వర్మ తెలిపారు.

     వారి గురించి బయటకు చెబితే అవకాశాలు రావు

    వారి గురించి బయటకు చెబితే అవకాశాలు రావు

    వారి గురించి ఇలాంటివి బయటకు చెప్పినపుడు సడెన్‌గా మీకు తెలియకుండా అన్ని విధాలుగా ఇబ్బందు మొదలు అవుతాయి. అందుకే ఇపుడు చాలా మంది యాక్టర్లు శ్రీరెడ్డి గురించి బాధ పడుతున్నారు. ఆమె కెరీర్ ఇంతటితో ఫినిష్ అవుతుంది, కేవలం ప్రొఫెషనల్ కెరీర్ మాత్రమే కాదు, పర్సనల్ కెరీర్ కూడా నాశనం అవుతుంది. చాలా మంది ఈ భయంతోనే ఇలాంటివి బయట పెట్టడానికి ఇష్టపడరు... అని వర్మ తెలిపారు.

    అన్ని చోట్లా ఉంది

    అన్ని చోట్లా ఉంది

    కార్పొరెట్ ఆఫీసులలో కానీ, ఎక్కడైనా కానీ ఒక అమ్మాయి మీద హరాస్మెంటో? ఇంకోటో చేసినపుడు ఒక ఇంటర్నల్ గా కమిటీ వేస్తారు. అక్కడ అది సాల్వ్ కాకపోతే వారు పోలీస్ స్టేషన్ వరకు వెళతారు. కాస్టింగ్ కౌచ్ అనేది మ్యాన్ అండ్ ఉమన్ మధ్యే జరుగుతుంది...ఇది దాదాపు అన్ని చోట్లా ఉంటుంది అని వర్మ తెలిపారు.

    అందుకే అలా....

    అందుకే అలా....

    రెగ్యులర్, నార్మల్ పీపుల్ ఆఫ్ సొసైటీలో మనం ఉన్నాం. ఓసారి షూటింగకు మా అమ్మతో పాటు మా ఆంటీ కూడా వచ్చారు. అపుడు ఊర్మిళతో సినిమా చేస్తున్నాను. ఊర్మిల 100 మంది యూనిట్ ముందు తడి బట్టలతో ఉండటం చూసి ఆవిడ కంపర పడిపోయింది. వారి మెంటాలిటీ అలాగా ఉంటుంది. సమాజంలో మెజారిటీ పీపుల్ అలాగే ఉంటారు. అదే విధంగా ఇండస్ట్రీ ఇలాంటిదని తెలిసి, ఇలాంటివాటికి కమిట్ అవ్వాల్సి వస్తుందని తెలిసే చాలా మంది అమ్మాయిలు ఇండస్ట్రీకి వస్తారని మగాళ్లలో ఆలోచనలు ఉంటాయి. అందుకే వారిపై సింపథీ లెవల్స్ కూడా తక్కువగా ఉంటాయి అని వర్మ తెలిపారు.

    English summary
    RGV has opened up about Tollywood casting couch. He shared about a conversation between a heroine and a popular producer in Hyderabad.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more