మీడియా బేస్ గా రణ్ చిత్రాన్ని రూపొందించిన రామ్ గాపాల్ వర్మ త్వరలో వార్నింగ్ అనే చిత్రాన్ని రూపొందించటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన మీడియాతో చెబుతూ భయం అంటే ఏమిటే పూర్తి స్ధాయి అనుభవంలోకి రావాలంటే మీరు వార్నింగ్ సినిమా వచ్చేదాకా ఆగాల్సింది. త్రిడి హర్రర్ ఫిల్మ్ ఇది. ఇప్పటివరకూ త్రిడిలో ఇటువంటి జెనర్ రాలేదు. ఇది తెరపై చూడటం అసాధరణమైన ఎక్సపీరియన్స్ అనేది నిజం. ఇక ఈ చిత్రం త్రీడీలోనే ఎందుకు తీయాలంటే అది చూస్తున్నంతసేపూ ఆ వాతావరణంలోనే ఉన్న ఫీలింగ్ రావాలి. వాస్తవంగా నడిచే ఈ చిత్రం మామూలుగా చూస్తేనే వణుకు వస్తుంది. అలాంటిది త్రీడిలో చూస్తే ఎలా ఉంటుందో ఊహించండి అంటున్నారు. ఇక ఈ చిత్రానికి ట్యాగ్ లైన్ -మీరు చచ్చిపోతారు అని చాలా ఏంగ్జైటీతో చెప్తున్నారు. రితీష్ దేశ్ ముఖ్ ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తారు. త్వరలోనే మిగతా తారాగణం గురించి వివరిస్తాను అంటున్నారు.