»   » అందమైన అమ్మ, పక్కన జోకర్...... సొంత తల్లిపై రామ్ గోపాల్ వర్మ పోస్ట్!

అందమైన అమ్మ, పక్కన జోకర్...... సొంత తల్లిపై రామ్ గోపాల్ వర్మ పోస్ట్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు తరచూ ఏదో ఒక పోస్టు సోషల్ మీడియా చేయనిదే రోజు గడవదు. ఎప్పుడూ వివాదాలతో సావాసం చేస్తూ బయటి ప్రపంచం కంటే సోషల్ మీడియా ప్రపంచంలోనే ఎక్కువగా గడిపే వర్మ.... తాజాగా తన తల్లి ఫోటోతో ఓ పోస్టు చేశాడు.

వర్మ చేసిన ఈ పోస్టుకు మంచి స్పందన వస్తుంది. వందలాదిగా వర్మ అభిమానులు స్పందిస్తున్నారు. వేలల్లో లైక్స్ వస్తున్నాయి. అయితే ఈ పోస్టు ఎలాంటి వివాదాలు లేకుండా చాలా సాఫ్ట్ గా ఉంది.

వర్మ ట్వీట్ ఇదే

వర్మ టీనేజీ వయసులో ఉన్నపుడు తన తల్లితో కలిసి దిగిన ఫోటోను పోస్టు చేశారు. అమ్మ ఎంతో బ్యూటిఫుల్ అంటూ కీర్తిస్తూ.... పక్కనే ఉన్న కుర్రాడి గురించి జోకర్ అంటూ కామెంట్ చేశారు. ఆ జోకర్ తానే అంటూ వర్మ పేర్కొనడం గమనార్హం.

వర్మ మీద ఆయన తల్లి అభిప్రాయం

వర్మ మీద ఆయన తల్లి అభిప్రాయం

రామ్ గోపాల్ వర్మ మీద బయట జనాల్లో రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. కొడకు ఎలాంటి వాడైనా అమ్మ దృష్టిలో అభిప్రాయం ఒకటే ఉంటుంది. ఆ మధ్య ఓ సందర్భంలో రాంగోపాల్‌ వర్మ గురించి ఆయన తల్లి సూర్యావతి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు.

వర్మకు చెడ్డతనం తెలియదట

వర్మకు చెడ్డతనం తెలియదట

"కొడుకు మీద ప్రేమతో చెప్పడం లేదు కానీ..నిజాయితీగా చెబుతున్న మాట, వర్మకు చెడ్డతనం అంటే తెలియదు. మరొకరు మాట అనకుండా తనకుతానే అనేసుకుంటాడు. ఒకరికి సమాధానం చెప్పే పరిస్థితి తెచ్చుకోడు." అని గతంలో ఓసారి సూర్యావతి వ్యాఖ్యానించారు.

వర్మ చేసిన తప్పు అదే

వర్మ చేసిన తప్పు అదే

‘తనకు తెలిసినంత వరకు వర్మ తన జీవితంలో చేసిన ఒకే ఒక్క తప్పు పెళ్ళి చేసుకోవడం అని, తన కోడలు విషయంలో ఎటువంటి తప్పు లేకపోయినా వర్మ ఒంటరిగా ఉండాలని కోరుకోవడంతో తన భార్యకు దూరం అయ్యాడు' అని ఆమె గతంలో ఓ సారి తెలిపారు.

అంత మంచోడంట

అంత మంచోడంట

‘వర్మ తన చిన్నతనంలో దోమలను చంపినా ఇష్టపడే వాడు కాడని, దోమలను సున్నితంగా తరిమి కొట్టాలికాని వాటిని చంపడం ఎందుకు అని తనను ప్రశ్నించేవాడని, తన కొడుకు అంత మంచోడు' అంటూ వర్మ తల్లి గతంలో ఓసారి తెలిపారు.

బాగా అర్థం చేసుకునేవాడట

బాగా అర్థం చేసుకునేవాడట

"కూతుర్ని, అమ్మని, తమ్ముడ్ని అన్ని విధాలుగా బాగా చూసుకుంటాడు. అందర్ని బాగా అర్థం చేసుకున్నాడు. తన భార్యతో విడిపోయాక కూడా కూతురికి కావాల్సినవి చూసుకునే వాడు" అని సూర్యావతి గతంలో ఓ సందర్భంలో తెలిపారు.

అమ్మకు ఇష్టమైన సినిమా

అమ్మకు ఇష్టమైన సినిమా

"వర్మ తీసిన సినిమాల్లో నాకు ఇష్టమైనది 26/11 అని చెప్పింది"... గతంలో ఓ సందర్భంలో సూర్యావతి తెలిపారు.

English summary
"This beautiful woman is my mother and the joker looking nerdish guy standing next to her is me." RGV posted his mother pic in FB.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu