2.0 ఎఫెక్ట్... వెనక్కి తగ్గిన రామ్ గోపాల్ వర్మ, ‘భైరవగీత వాయిదా’
రజనీకాంత్ మూవీ 2.0తో పోటీ పడుతూ తన 'భైరవ గీత' చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించిన రామ్ గోపాల్ వర్మ నిన్నటి మొన్నటి వరకు మీడియాలో హడావుడి చేశారు. అంతే కాకుండా 2.0పై కాంట్రవర్సల్ ట్వీట్స్ చేసి మరోసారి తన వివాదాస్పద నైజం నిరూపించుకున్నారు.
2.0 మూవీ నవంబర్ 29న విడుదలవుతుండగా... 'భైరవ గీత' చిత్రాన్ని నవంబర్ 30న ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే 2.0 చిత్రానికి ఏర్పడిన క్రేజ్ చూసి వర్మ వెనక్కి తగ్గక తప్పలేదు, తన చిత్రాన్ని డిసెంబర్ 6కు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నాడు.

ధనంజయ, ఇర్రా మోర్ ప్రధాన పాత్రలో 'భైరవగీత' చిత్రం తెరకెక్కింంది. నూతన దర్శకుడు సిద్ధార్థ తాతోలు దర్శకత్వం వహించిన ఈ సినిమా రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కగా ఎమోషనల్ లవ్ స్టోరీ కాన్సెప్టుతో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో పాటు అంచనాలు పెంచింది. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సమర్పిస్తున్న ఈ సినిమా కి రవిశంకర్ సంగీతం సమకూరుస్తుండగా, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామ, భాస్కర్ రాశి నిర్మించారు.


Click it and Unblock the Notifications











