RGV పవర్ స్టార్ ఫస్ట్ లుక్.. మెగాస్టార్‌ని కూడా వదలని వర్మ.. ఎన్నికల తరువాత జరిగిన కథ!
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేశాడు. పవర్ స్టార్ పేరుతో ఒక సినిమా చేయబోతున్నాను అని గత కొన్ని రోజులుగా ప్రచారం చేస్తోన్న విషయం తెలిసిందే. ఇక ఫైనల్ గా ఆ సినిమాకు సంబంధించిన స్పెషల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశాడు. మొన్నటివరకు కాస్త మసాలా బోల్డ్ సినిమాలతో హడావుడి చేసిన వర్మ ఇప్పుడు సడన్ గా ట్రాక్ చేంజ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.

ఇప్పుడు ఎలా చూపిస్తాడో..
మొన్నటివరకు క్లైమాక్స్, నగ్నం అంటూ హడావుడి చేసిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు పవర్ స్టార్ సినిమాను సెలెక్ట్ చేసుకోవడం వెనక కారణం ఏమిటనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గతంలో అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అనే సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్రను వెటకారంగా చూపించిన వర్మ ఇప్పుడు ఎలా చూపిస్తాడు అనేది కూడా హాట్ టాపిక్ గా నిలుస్తోంది.

పవర్ స్టార్ లుక్ వైరల్..
ఇక పవర్ స్టార్ ఫస్ట్ లుక్ ని గమనిస్తే.. ఎన్నికల ఫలితాల తరువాత పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నాడు అనే విషయాన్ని ఎక్కువగా ప్రజెంట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది పూర్తిగా కల్పితమైన పాత్రలతో కూడిన కథ అని చెబుతున్న వర్మ ఇన్ డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయడం కొత్త వివాదానికి దారి తీస్తోంది.

మరొక పోస్టర్ లో మెగాస్టార్..
మరొక పోస్టర్ లో ఎన్నికల అనంతరం మెగాస్టార్ చిరంజీవిని కూడా ఇన్వాల్వ్ చేశాడు వర్మ. పవర్ స్టార్ సినిమాలో ఇద్దరు బ్రదర్స్ ఉన్న మూమెంట్ అంటూ వర్మ ఆ పోస్టర్ ని షేర్ చేశాడు. జనసేన గ్లాస్ గుర్తును కూడా ఉపయోగిస్తున్న వర్మ ఎలక్షన్స్ కి ముందే పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ వస్తున్నాడు. ఇక ఈ సారి కాంట్రవర్సీ డోస్ మరింత పెంచి క్యాష్ చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు అనిపిస్తోంది.
Recommended Video

జై పవర్ స్టార్ అంటూ..
గతంలో ఎన్నో కాంట్రవర్సీ కథలను టచ్ చేసిన వర్మ ఓటీటీ వరల్డ్ ఆలోచన వచ్చాక డోస్ ఇంకాస్త పెంచాడనే చెప్పాలి. ఇక పవర్ స్టార్ సినిమాను కూడా ఆర్జీవి వరల్డ్ థియేటర్ లో త్వరలోనే రిలీజ్ చేయనున్నట్లు చెబుతూ జై పవర్ స్టార్ అనే హ్యాష్ ట్యాగ్ కూడా ఇచ్చాడు. మరి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ని అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications