వర్మ 3D మూవీ ‘భూ..’లో మనీషా
సినిమా విషయమై వర్మ మాట్లాడుతూ....'మనీషా కొయరాలతో కలిసి పని చేయడం మంచి అనుభూతిని ఇచ్చిందని, ఇందులో ఆమె పాత్ర ప్రత్యేకంగా ఉంటుందని తెలిపారు. ప్రతి సీన్ 3Dలో చిత్రీకరించడానికి చాలా కష్ట పడ్డాం. ఇందుకు చాలా పేషెన్స్ కావాలి. మొత్తానికి సినిమాను విజయవంతంగా పూర్తి చేశాం' అని తెలిపారు.
ఈ చిత్రంలో ప్రత్యేకంగా హీరోయిన్ అంటూ ఎవరూ లేరని...ఓ చిన్న పాపాయి చుట్టూ సినిమా తిరుగుతుందని రామ్ గోపాల్ వర్మ వెల్లడించారు. ప్రస్తుతం డిజిటల్ వర్క్ జరుగుతోందని, ఆగస్టులో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వర్మ చెప్పుకొచ్చారు.
అజయ్ దేవగన్, ఊర్మిలా మటోండ్కర్ ప్రధాన పాత్ర ధారులుగా 2003లో వచ్చిన 'భూత్' సినిమా అప్పట్లో మంచి విజయం సాధించింది. ఈనేపథ్యంలో దానికి సీక్వెల్‌గా రూపొందుతున్న 'భూ...' చిత్రంపైనా మంచి అంచనాలున్నాయి. ఈ చిత్రంతో పాటు 'డిపార్ట్‌మెుంట్' చిత్రానికి కూడా వర్మ దర్శకత్వం వహిస్తున్నారు.


Click it and Unblock the Notifications












