రామ్ గోపాల్ వర్మ, పూరీ జగన్నాధ్, హరీష్ శంకర్ ల 'పెళ్ళి'
ప్రముఖ దర్శకులు రామ్ గోపాల్ వర్మ మరో ప్రయోగానికి నాందిపలికారు. ముగ్గురు దర్శకులు కలిసి 'పెళ్ళి' టైటిల్ తో ఓ చిత్రాన్ని రూపొందించనున్నారు. వివాహ వ్యవస్థ గురించి విభిన్నరీతిలో రూపుదిద్దుకునే ఈ చిత్రానికి రాంగోపాల్ వర్మ, పూరిజగన్నాథ్, హరీష్‌శంకర్ దర్శకత్వం వహిస్తారు. మూడు వేర్వేరు కథల ప్రభావం మరో కథ మీద ఎలా ఉంటుందన్నదే ఈ చిత్రం ప్రత్యేకత అని చెప్తున్నారు.
ఈ చిత్రం కథ గురించి వివరిస్తూ...ఒక వ్యక్తి ఓ యువతిని గాఢంగా ప్రేమిస్తాడు. కానీ అతనికి పెళ్లి అనే వ్యవస్థ మీద వివిధ కారణాల వల్ల విభిన్న అభిప్రాయాలు ఏర్పడతాయి. ఆ కారణాలకు కారణం పెళ్లి చేసుకున్న మూడు జంటలు, పెళ్లి వల్ల వాళ్లు ఎదుర్కొన్న మానసిక స్థితులు ఆ వ్యక్తికి తెలియడమే. అలాంటి నేపథ్యంలో అతను తన పెళ్లి గురించి ఎలాంటి నిర్ణయిం తీసుకున్నడన్నదే మిగతా కథ అంటున్నారు.
ఈ మూడు జంటలకు సంబంధించిన మూడు కథల్ని రాంగోపాల్ వర్మ, పూరిజగన్నాథ్, హరీష్‌శంకర్ తమ శైలిలో రచించి తెరపై ప్రజెంట్ చేయడం ఈ సినిమా ప్రత్యేకత. ఈ మూడు జంటలు సినిమాలో ఒకరికొకరు ఎదురుపడరు. వారి మధ్య పరిచయమే ఉండదు. అయితే నాలుగో కథలోని వ్యక్తి మాత్రం ఈ మూడు కథల్లో కామన్ కేరెక్టర్.
తెలుగు తెరపై మరో సరికొత్త ప్రయోగంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం పబ్లిసిటి విషయంలో కూడా కొత్త పంథాని అనుసరించనున్నారు. పోస్టర్లమీద, టి.వి. ప్రోమోస్‌లో కానీ, ట్రైలర్స్‌లో కానీ నటీనటుల ఫొటోలు కనిపించవు. పెళ్లికి సంబంధించిన సింబల్స్ మాత్రమే ఉంటాయి. వివాహ వ్యవస్థకు సంబంధించిన డైలాగులు వినిపిస్తాయంతే అంటున్నారు. ఈ చిత్రంలో నటీనటులు ఎవరనేది బయటకు తెలియనీయరు. తెర మీదే చూడాలి అంటున్నారు వర్మ.


Click it and Unblock the Notifications











