»   » వర్మ దిమ్మతిరిగే షాకిచ్చాడే?: 'జీఎస్‌టీ' చూడాలంటే!.., అదే జరిగితే తిరుగుండదు..

వర్మ దిమ్మతిరిగే షాకిచ్చాడే?: 'జీఎస్‌టీ' చూడాలంటే!.., అదే జరిగితే తిరుగుండదు..

Subscribe to Filmibeat Telugu
వర్మ 'జీఎస్‌టీ' చూడాలంటే ఒక కండిషన్!

తన ఫోకస్‌ను సిల్వర్ స్క్రీన్ నుంచి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ మీదకు షిఫ్ట్ చేసిన వర్మ.. గాడ్ సెక్స్&ట్రూత్ ద్వారా ట్రెండ్ సెట్ చేయాలని భావిస్తున్నారు. కేవలం థియేటర్‌లో ఆడే సినిమాలకే కాదు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో రిలీజ్ చేసే సినిమాల ద్వారా కూడా కలెక్షన్ల వర్షం కురిపించవచ్చని వర్మ నిరూపించబోతున్నారట. జీఎస్‌టీ తోనే ఆయన ఈ ఫీట్ చేసి చూపించబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది.

వర్మ 'ఇంటలెక్చువల్ రేప్'?, 'గాడ్, సెక్స్ అండ్ ట్రూత్' నాదే: జయకుమార్ సంచలనం

'గాడ్ సెక్స్&ట్రూత్' ఫోటోస్ లీక్: పచ్చిగా తీస్తున్నారట?.. ఎంతలా అంటే?

వర్మ 'ఇంటలెక్చువల్ రేప్'?, 'గాడ్, సెక్స్ అండ్ ట్రూత్' నాదే: జయకుమార్ సంచలనం

'గాడ్,సెక్స్&ట్రూత్' లీకైన ఫోటో ఇదే: వర్మ పక్కన న్యూడ్‌గా మియా మాల్కోవా..

ఇంతకీ ఏం చేయబోతున్నారు?:

ఇంతకీ ఏం చేయబోతున్నారు?:

జీఎస్‌టీని వర్మ ఆన్‌లైన్ లోనే(వీమియో వెబ్ సైట్) రిలీజ్ చేస్తారన్న సంగతి తెలిసిందే. అయితే సినిమాను 'ఫ్రీ'గా చూసేద్దామనుకున్నవాళ్లకు మాత్రం నిరాశ తప్పదేమో. ఎందుకంటే ఆన్‌లైన్ లోనూ టికెట్ పెట్టి మరీ సినిమా చూపించబోతున్నారట వర్మ.

రేటు కూడా ఫిక్స్?:

రేటు కూడా ఫిక్స్?:

ఆన్‌లైన్ రూ.150 టికెట్ రేటు ఫిక్స్ చేసి సినిమాను వదలబోతున్నారట. సినిమా పట్ల ఉన్న బజ్ రీత్యా మంచి మంచి కలెక్షన్స్ వస్తాయన్న ఉద్దేశంతోనే ఇలా టికెట్ పెట్టాలని నిర్ణయించుకున్నారట. అయినా.. ఇంటర్నెట్ లో ఫ్రీగా పోర్న్ దొరుకుతుంటే.. అంత డబ్బు పెట్టి 'జీఎస్‌టీ 'ని ఎవరైనా చూస్తారా? అన్న అనుమానం కూడా కలగకమానదు.

అదే జరిగితే వర్మకు తిరుగుండదు.:

అదే జరిగితే వర్మకు తిరుగుండదు.:

ఎలాగూ థియేటర్స్ లో రిలీజ్ చేసే సినిమా కాదు కాబట్టి.. ఇలాగైనా ఎంతో కొంత డబ్బు రాబట్టవచ్చనేది వర్మ ప్లాన్ గా తెలుస్తోంది. ఒకవేళ ఐడియా సక్సెస్ అయితే దిమ్మతిరిగే స్థాయిలో కలెక్షన్స్ వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. అదే జరిగితే వర్మకు ఇక తిరుగుండదు. ఇప్పుడు తనను విమర్శిస్తున్నవాళ్లందరికీ ఆ కలెక్షన్స్ ను చూపించి సమాధానం చెబుతాడు.

ఇదంతా నిజమేనా?:

ఇదంతా నిజమేనా?:

అయితే 'జీఎస్‌టీ'కి వర్మ టికెట్ ఫిక్స్ చేయబోతున్నారన్న ప్రచారంలో నిజమెంత అనేది మాత్రం తెలియడం లేదు. ఒకవేళ ఆర్జీవి నిజంగా టికెట్ పెట్టాలనుకుంటే.. ముందే చెప్పి ఉండేవారు కదా.. అనేది కొంతమంది అభిప్రాయం.

అయితే షాక్ లు ఇవ్వడం ఆర్జీవికి అలవాటే కాబట్టి.. రేపు ఉదయం వర్మ అదే పని చేయబోతున్నారని మరికొంతమంది చెబుతున్నారు. ఏదేమైనా జీఎస్‌టీ విడుదలైతే తప్ప దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం లేదు.

ఎలా ఉంటుందో?:

ఎలా ఉంటుందో?:

రిలీజ్ కు ముందే తీవ్ర చర్చను లేవనెత్తిన 'జీఎస్‌టీ'పై.. ఆ తర్వాత ఎంత చర్చ జరుగుతుందనేది కూడా ఆసక్తికరంగా మారింది. వర్మ దీన్నో బోల్డు ఫిలిం తరహాలో చిత్రీకరించారా?.. లేక తాను చెప్పినట్లు 'వుమెన్ లిబరేషన్' ఫిలాసఫీకే పెద్ద పీట వేశారా? అన్నది జీఎస్‌టీ రిలీజ్ అయితే గానీ చెప్పలేం. ఏదేమైనా గణతంత్ర దినోత్సవ వేళ.. వర్మ అందరి మైండ్స్‌ను అటువైపు తిప్పేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

English summary
As per the latest flash RGV is planning to keep a ticket of Rs. 150 for a person to watch the film GST. Pornstar Mia Malkova who did more than 200 porn films is playing the lead role in the short film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu