ఆ కాన్సెప్ట్ తో ప్రకాష్ రాజ్ హీరోగా రామ్ గోపాల్ వర్మ చిత్రం
రామ్ గోపాల్ వర్మ తాజాగా "రాజకీయం" అనే టైటిలో ఓ చిత్రం చేయనున్నానని ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే ఆ చిత్రానికి హీరోగా ప్రకాష్ రాజ్ ని ఎంపిక చేసినట్లు ఆయన ట్వీట్ చేసారు. దాంతో ప్రకాష్ రాజ్ కూడా చాలా సంతోషంగా సమాధానం ఇచ్చారు. ప్రకాష్ రాజ్ ట్వీట్ లో ...దుబాయి నుంచి వచ్చి ఆర్ జి వి జూమ్ లో ట్వీట్ చూసాను.మీతో పనిచేయటం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది అన్నారు. ఇక ఈ చిత్రం గురించి వర్మ చెబుతూ..బయట జరుగుతున్న రాజకీయ పరిస్ధితులని చూస్తుంటే తనకు "రాజకీయం" అనే టైటిల్ తో ఓ చిత్రం చేయాలని తీవ్రమైన కోరిక పుట్టిందని అంటున్నారు.
"రాజకీయం" కథ రాజకీయ మెకానిజం గురించి, రాజకీయ సైకాలజీల గురించి చర్చిస్తుందని చెప్పారు. అలాగే రాజకీయం గురించి వింటూంటే వెనక ఏం జరుగుతోంది, ముందుకు ఏం కనపడుతోందని అనేది చూస్తే అండర్ వరల్డ్ పాలిటిక్స్ ఎక్కువగా ఉన్నాయని, అలాగే పాలిటిక్స్ లో అండల్ వరల్డ్ వాతావరణం ఎక్కువగా ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. ఇక తను చేసిన కంపెనీ చిత్రం అండర్ వరల్డ్ పాలిటిక్స్ ని చూపితే, సర్కార్..ఫ్యామిలీ పాలిటిక్స్ ని చర్చిందని, ఇప్పుడు పొలిటికల్ పాలిటిక్స్ ని చూపాలని నిర్ణయించుకున్నానని అన్నారు. ప్రస్తుతం వర్మ సునీల్ హీరోగా కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం..అప్పలరాజు అనే చిత్రం డైరక్ట్ చేస్తున్నారు. సంక్రాంతికి ఈ చిత్రం రిలీజ్ అవుతుంది. అలాగే ఆయన తాజా చిత్రం రక్త చరిత్ర-2 డిసెంబర్ మూడవ తేదీన విడుదల అయి ప్లాప్ టాక్ తెచ్చుకుంది.


Click it and Unblock the Notifications











