వర్మ 'రక్త చరిత్ర' రిలీజ్ డేట్ ఫోస్ట్ ఫోన్ ఎప్పటికంటే...
రామ్ గోపాల్ వర్మ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న 'రక్త చరిత్ర' చిత్రం రిలీజ్ సెప్టెంబర్ 17కి ఫోస్ట్ ఫోన్ అయినట్లు సమాచారం. మొదట ఈ చిత్రం పస్ట్ ఫార్ట్ రిలీజ్ ఆగస్టు 11న అవనుందని వర్మ స్యయంగా చెప్పారు. అయితే పార్ట్ 2 చిత్రం పనులు పూర్తి కాకపోవటంతో ఈ చిత్రం రిలీజ్ ని ఫోస్ట్ ఫోన్ చేసినట్లు సమాచారం. మొదటి పార్ట్ రిలీజైన రెండు వారాల తర్వాత పార్ట్-2 రిలీజు అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. అలాగే హిందీ, తెలుగులో మాత్రమే రెండు భాగాలుగా తీశారు. తమిళం కోసం ప్రత్యేకంగా చేశారు. తమిళంలో ఒక భాగం మాత్రమే ఉంటుంది. హిందీ, తెలుగులో తీసిన మొదటి భాగంలో వివేక్ ఓబరాయ్ మాత్రమే కనిపిస్తారు. రెండవ భాగం నుంచి సూర్య ఎంట్రీ ఉంటుంది. తమిళంలోనూ సెప్టెంబర్ నెలలోనే విడుదల చేయనున్నారు. రక్త చరిత్ర చిత్రంలో పరిటాల రవిగా వివేక్ ఓబరాయ్, సూరిగా సూర్య చేశారు. సూరి భార్య భానుమతి కేరక్టర్ ప్రియమణి అయితే, రవి భార్య సునిత పాత్ర అనితా ఆప్టే పోషించారు.


Click it and Unblock the Notifications











