ఆ రాత్రి చాలా భయపడ్డాను.. రామ్ గోపాల్ వర్మ
హర్రర్ చిత్రాలు చేయటంలో అమితమైన ఆసక్తి చూపించే రామ్ గోపాల్ వర్మ రీసెంట్ గా తన బ్లాగ్ లో తను భయపడ్డ అనుభవం గురించి రాసుకొచ్చారు. ఆయన మాటల్లోనే...నేను ఇప్పటికీ ఆ రాత్రిని మరిచిపోలేదు. రాత్రి మూడు గంటలకు భూత్ షూటింగ్ పూర్తిచేసుకుని వచ్చి పడుకున్నాను. నిద్రలోకి జారటానికి ప్రయత్నిస్తూంటే నాకు సడెన్ గా భూత్ లో ఉన్న దెయ్యం గదిలో ని కప్ బోర్డ్ వెనక ఉన్నట్లు అనిపించింది. ఆ పీలింగ్ కి నాకు వెంట్రుకలు నిక్కపొడుచుకున్నాయి. అయితే అదంతా నా ఊహే అని పెద్దగా నవ్వుకున్నాను. అయితే దెయ్యం నవ్వే నవ్వు నా నవ్వుతో పాటు వినిపించింది. నేను ఆగా...అంతా సైలెన్స్. నేను అప్పుడు గుర్తు చేసుకున్నా ఆ దెయ్యం నా ఊహల్లోంచి పుట్టింది అని...నా మైండ్ నాతో ట్రిక్స్ ప్లే చేస్తోందని. అయితే కప్ బోర్డ్ వెనక ఎవరన్నా ఉన్నారా అని చెక్ చెయ్యాలనిపించింది. అయితే నా సెన్సిబులిటీస్ నాకు ఆ అవకాశం ఇవ్వలేదు. అయితే కాస్సేపటికి ఆగలేక ఆ కప్ బోర్డుని తెరిచి ఆ దెయ్యాన్ని పేరు పెట్టి పిలిచాను. అయితే ఆన్సర్ గా భయంకర నిశ్శబ్దం వినిపించింది. అలా కాస్సేపు గడిచాక నేను సెల్ ఫోన్ తీసుకుని ఆ దెయ్యం వేసిన ఆర్టిస్టుకు ఫోన్ చేసాను. ఆమె వెంటనే..హాయ్ రామూజీ అంటూ అంత రాత్రివేళ ఫోన్ చేయటం ఏమిటీ అని ఆశ్చర్యం కనపరుస్తూ...ఫోన్ లిప్ట్ చేసింది. దాంతో నేను ప్రొడక్షన్ కి సంబందించిన విషయాలు అడిగి కాస్సేపు మాట్లాడి పెట్టేసాను. అప్పుడు నేను నార్మల్ స్టేట్ కి వచ్చాను అంటూ రాసుకొచ్చారు.


Click it and Unblock the Notifications











