లక్ష్మీస్ ఎన్టీఆర్: మరింత వేడి పెంచిన వర్మ... చంద్రబాబు- బాలయ్య వీడియో వైరల్!
Recommended Video

'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా విషయంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరింత వేడి పెంచారు. ఎన్టీఆర్‌కు సంబంధించిన వీడియోలు, వాయిస్ ఓవర్ బైట్స్ పోస్ట్ చేస్తూ డైరెక్ ఎటాక్ ప్రారంభించారు. వర్మ పోస్టు చేసిన వాటిలో బాలయ్య వీడియో కూడా ఉండటం గమనార్హం.
బి బి సపోర్టింగ్ లక్ష్మీస్ ఎన్టీఆర్... సిబి అప్ సెట్ అంటూ బాలయ్య, చంద్రబాబు వాయిస్ మార్పింగ్ చేసిన ఫన్నీ వీడియోను వర్మ తన ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న వీడియో
అసెంబ్లీలో చంద్రబాబు, బాలయ్య మధ్య లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై చర్చ జరిగినట్లుగా క్రియేట్ చేసిన ఫన్నీ వీడియోను రామ్ గోపాల్ వర్మ షేర్ చేశారు.
వాడూ నా పిల్లలు కలిసి వెన్నుపోటు పొడిచారు
వాడు నా పిల్లలు కలిసి వెన్నుపోటు పొడిచారు.. అనే డైలాగ్‌తో రూపొందించిన పోస్టర్ షేర్ చేయడం ద్వారా రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రం విషయంలో హైప్ మరింత పెంచే ప్రయత్నం చేశారు.

సినిమా ఆపివేయాలంటూ ఫిర్యాదు
‘లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా విడుదల నిలిపివేయాలని కోరుతూ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు టీడీపీ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ కార్యకర్త దేవీబాబు చౌదరి ఎన్నికల కమిషన్‌ను కలిసి ఈ నెల 22న విడుదల కాబోతున్న ఈ సినిమా విడుదల నిలిపివేయాలనికోరారు. సినిమాలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాత్రను నెగెటివ్‌గా చూపించారని, సినిమా ఓటర్లపై ప్రభావం చూపుతుందని అభ్యంతరం వ్యక్తం చేశారు. తొలి విడత పోలింగ్ పూర్తయ్యే వరకు సినిమా విడుదల నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

ఆర్జీవీ రియాక్షన్
తన చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చి 22న విడుదల చేయబోతున్నట్లు వర్మ స్పష్టం చేశారు. ఒక వేళ ఈసీ అభ్యంతరం తెలిపితే సినిమా విడుదల కోసం ఫైట్ చేస్తానన్నారు.


Click it and Unblock the Notifications











