వల్గారిటీకి పరాకాష్ట :'ఐస్ ఫ్రూట్' చీకుతూ ఆమె (వీడియో)

By Srikanya

హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నుంచి వస్తున్న తాజా క్రీమ్.. ఐస్ క్రీమ్-2. జె.డి.చక్రవర్తి, నవీనా, శాలిని, ధనరాజ్, భూపాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ చిత్రం ప్రమోషనల్ సాంగ్ విడుదలైంది. ఐస్ ఫ్రూట్ అంటూ విడుదలైన ఈ వీడియో యూత్ ని బాగానే ఆకట్టుకుంటోంది. అంతగా ఆకట్టుకుంటున్న విషయం ఏంటో ఈ వీడియోలో చూడండి..

ఈ పాటలో హీరోయిన్ నవీన వల్గారిటీకి పరాకాష్టలాంటి ఎక్సప్రెషన్స్ తో రెచ్చిపోయింది. దానికి తగ్గట్లే లిరిక్స్ కూడా వల్గర్ గా రాసారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో త్వరలో 'ఐస్ క్రీమ్-2' చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. ఎన్.టి.ఎఫ్.సి, భీమవరం టాకీస్ బేనర్లపై తుమ్మలపల్లి సత్యనారాయణ నిర్మిస్తున్న ఈచిత్రానికి సంబంధించిన 20 ఫస్ట్ లుక్స్ ఒకేసారి విడుదల చేసి ఆ మధ్య సంచలనం సృష్టించాడు వర్మ.

‘‘ఐస్‌క్రీమ్‌' సినిమాకి జరిగిన పొరపాట్లు ‘ఐస్‌క్రీమ్‌-2'కి జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నాను'' అని రాంగోపాల్‌ వర్మ అన్నారు. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘ఐస్‌క్రీమ్‌-2'. జె.డి.చక్రవర్తి, నందు, నవీనా కీలక పాత్రధారులుగా భీమవరం టాకీస్‌ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఈ నెల 21న విడుదలకానుందీ చిత్రం. ప్రమోషన్‌లో బాగంగా నందు, ననీనాలపై తెరకెక్కించిన ‘ఐస్‌ఫ్రూట్‌' పాటను మంగళవారం ప్రసాద్‌ ప్రివ్యూ థియేటర్‌లో విడుదల చేశారు.

RGV released ‘Ice Fruit’ video song

రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. ‘‘ఐస్‌క్రీమ్‌ సినిమాను ఒకే ఇంట్లో చిత్రీకరించాం. కానీ ఈ సినిమాను ఔట్‌డోర్‌లో చక్కని లొకేషన్లలో రూపొందించాం. టీమంతా కష్టపడి చేస్తే ఔట్‌డోర్‌ బాగా వస్తుందనడానికి ఈ సినిమా ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. ఉత్కంఠగా సాగుతూనే చక్కని వినోదాన్ని పంచుతుంది'' అని తెలిపారు.

నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ ‘‘కొంత భాగాన్ని రీషూట్‌ చెయ్యడం వల్ల సినిమా రిలీజ్‌ లేట్‌ అయింది. ఈ నెల 21న 300కు పైగా థియేటర్‌లలో సినిమాను విడుదల చేస్తున్నాం'' అని అన్నారు.

జె.కె.భారవి మాట్లాడుతూ ‘‘సినిమా రంగంలో కొత్త పొకడల్ని తీసుకొస్తున్న గురువు రాంగోపాల్‌వర్మ. సాంకేతికంగానే కాకుండా డిస్ర్టిబ్యూషన్‌ రంగంలో కూడా కొత్త పద్దతుల్ని ప్రవేశపెట్టి ‘సినిమా మేడ్‌ ఈజీ' అని రుజువు చేశారు. ఇటువంటి ప్రయత్నంలో ఎన్నో మాటలు, విమర్శలు వస్తుంటాయి. అవన్నీ రామసేతువులు అవుతాయి. ఐస్‌ఫ్రూట్‌ సాంగ్‌ చాలా హాట్‌గా ఉంది'' అని అన్నారు.

ఈ సీక్వెల్ చిత్రాన్ని సైతం వర్మ నాన్‌స్టాప్ షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తి చేసామని చెప్తున్నారు, ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ పనిలో నిమగ్నమయ్యారు. ఈ చిత్రం సైతం లో బడ్జెట్ లో పూర్తి చేసినట్లు చెప్తున్నారు. టైటిల్‌కు తగ్గట్లుగానే వర్మ ఇప్పటివరకూ తీసిన చిత్రాలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. ఫ్లోకామ్‌తో చిత్రీకరించిన సన్నివేశాలను చూసిన ప్రేక్షకులు సరికొత్త అనుభూతి పొందుతారని యూనిట్ సభ్యులు చెప్పారు.

అలాగే...ఐస్ క్రీమ్ 2 చిత్రంలో ఓ పాటలో నటింప చేసేందుకు ఒత్తిడి తీసుకువచ్చారని, వేధించారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆ చిత్ర హీరోయిన్ నవీన ఖండించారు. పాట చిత్రీకరణకు ముందే దర్శకుడు రాంగోపాల్ వర్మ తనతో చర్చించారని నవీన ఓ ఇంగ్లీష్ వెబ్ సైట్ కు ఇచ్చిన ఇంటర్వూలో వెల్లడించింది.

రాము గారు ఎన్నడూ వేధించలేదు.. బలవంత పెట్టలేదు, ఒత్తిడి చేయలేదు అని ఆమె అన్నారు. షూటింగ్ కు ముందే పాట గురించి వివరించారని.. ఆతర్వాత తాను చేయడానికి ఒప్పుకున్నానని నవీన స్పష్టం చేశారు. అశ్లీలానికి, గ్లామర్ కు ఓ చిన్న విభజన రేఖ ఉందన్నారు. నటిగా ఓ కొత్తదనం కోసం ప్రయత్నించాను. అయితే ఆపాట అంతగా అశ్లీలమనిపించలేదు.. ఒకవేళ అలా అనిపిస్తే తాను చేయడానికి నిరాకరించేదాన్ని అన్నారు.

నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ మాట్లాడుతూ.. జీనియస్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ‘ఐస్ క్రీమ్ 2′ చిత్రాన్ని అత్యద్భుతంగా రూపొందించారు. హారర్ తో పాటు గ్లామర్ కూడా పుష్కలంగా ఉన్న చిత్రమిది. ' అన్నారు.

ఈ చిత్రంలో జె.డి.చక్రవర్తి, నందు, భూపాల్, సిద్ధు, ధనరాజ్, నవీన, శాలిని, గాయత్రిలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. గతంలో వచ్చిన ‘ఐస్ క్రీం' చిత్రానికి ఇది సీక్వెల్. ‘ఐస్ క్రీమ్' చిత్రాన్ని రెండే రెండు మెయిన్ క్యారెక్టర్స్‌తో ఒకే ఒక ఇంటిలో షూట్ చేసారు. ‘ఐస్ క్రీమ్-2'ను మొత్తం ఔట్ డోర్ లో పదహారు ప్రధాన పాత్రలతో తీసారు. కథాపరంగా రెంటికీ సంబంధం లేదని చిత్ర యూనిట్ తెలిపారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ : తుమ్మలపల్లి అంజని కుమార్ - టి భరత్ కుమార్, నిర్మాత : తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, కథ - స్క్రీన్ ప్లే - మాటలు - దర్శకత్వం : రామ్ గోపాల్ వర్మ!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X